కేవలం ఈ 2 పదార్థాలతో చర్మాన్ని బ్రైట్ గా, టైట్ గా మార్చుకోవచ్చు.. తెలుసా?

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కఠినమైన చర్మం ఉత్పత్తులను వాడటం, మేకప్ తో నిద్రించడం, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ముఖ చర్మం సాగినట్లు అవుతుంది.ఇలా చర్మం సాగటం వల్ల ముఖంలో కాంతి సైతం తగ్గుతుంది.

 You Can Make The Skin Bright And Tight With Just These 2 Ingredients! Skin Tight-TeluguStop.com

దీంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ చర్మాన్ని టైట్ గా ఎలా మార్చుకోవాలో అర్థం కాక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.అయితే కేవలం ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతో సులభంగా మరియు వేగంగా చర్మాన్ని టైట్ గా, అదే సమయంలో బ్రైట్ గా మార్చుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ పౌడర్.దాదాపు అందరి ఇళ్లలోనూ ఇది ఉంటుంది.చాలా మందికి ఉదయం కాఫీ తాగనిదే రోజు కూడా గ‌డ‌వ‌దు.కాఫీని లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

అలాగే చర్మ సౌందర్యానికి కూడా కాఫీ పొడి గ్రేట్ గా సహాయపడుతుంది.అలోవెరా జెల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి అలోవెరా జెల్‌ను రకరకాలుగా వినియోగిస్తుంటారు.

అయితే ఇప్పుడు అలోవెరా, కాఫీ పౌడర్ ను ఉపయోగించే చర్మాన్ని బ్రైట్ గా టైట్ గా మార్చుకోవచ్చు.

అందుకోసం ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

అనంతరం అరగంట పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే కాఫీ పౌడర్ మరియు అలోవెరా జెల్ లో ఉండే గుణాలు చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.

ముడతలు ఏమైనా ఉంటే తగ్గించి చర్మాన్ని బ్రైట్ గా మెరిసేలా చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube