మోచేతుల నలుపు వారంలో మాయం అవ్వాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి!

సాధారణంగా చాలా మందికి బాడీ మొత్తం ఒక రంగులో ఉంటే మోచేతులు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.మోచేతుల నలుపును కొందరు పట్టించుకోరు.

 Follow This Tip To Get Rid Of Black Elbows In A Week! Black Elbows, Elbows White-TeluguStop.com

కానీ కొందరు మాత్రం ఆ నలుపును వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.మోచేతులను తెల్లగా మార్చుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఇంటి చిట్కా మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Tips, Black Elbows, Elbows Darkness, Elbows Remedy, Latest, Skin Care, Sk

ఈ చిట్కాను పాటిస్తే మోచేతుల( Elbows ) నలుపు వారంలో మాయం అవ్వడం ఖాయం.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, బియ్యం వేసుకోవాలి.అలాగే రెండు బంగాళదుంప స్లైసెస్, రెండు లెమన్ స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Black Elbows, Elbows Darkness, Elbows Remedy, Latest, Skin Care, Sk

ఇలా గ్రైండ్ చేసుకోకుండా మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మోచేతలకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం అర నిమ్మ చెక్కతో మోచేతులను ఐదు నిమిషాల పాటు బాగా రుద్ది వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ రెమెడీ మోచేతుల నలుపును సమర్థవంతంగా వదిలిస్తుంది.మోచేతులను తెల్లగా మృదువుగా మారుస్తుంది.కాబట్టి మోచేతులు నల్లగా ఉన్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube