రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనార్టీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులకు ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ( Outsourcing, guest faculty ) పద్ధతిలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ 8 పోస్టులకు 1:6 చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించారు.
జిల్లాలోని ఆయా మైనార్టీ విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ (జే ఎల్) పోస్టులకు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు.
ఒక్కో పోస్టుకు మెరిట్ ప్రకారం ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) అధ్యక్షతన ఆర్ ఎల్ సీ రాజేందర్, డిస్ట్రిక్ట్ ఇంచార్జీ మైనార్టీ ఆఫీసర్ రాధాభాయ్, ఓఎస్ డీ సర్వర్ మియా, ప్రిన్సిపాళ్లు లక్ష్మీనారాయణ, ఫాతిమా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.
మొత్తం 48 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు.