పప్పు తింటే ప్రోటీన్స్ వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు.ముఖ్యంగా మాంసాహారం తినని వారికి పప్పులు అనేవి అసలైన ప్రోటీన్స్.
వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే పప్పు దినుసులను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలని నిపుణులు చెబుతున్నారు.లేకపోతే ఇవి కలిగించే లాభం కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
పోషకాహారా నిపుణుల ప్రకారం సరైన మొత్తంలో పోషకాహారం తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ పై మంచి ప్రభావం చూపుతుంది.ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఇవి మన జీర్ణ క్రియను చాలా వరకు ప్రభావితం చేస్తాయి.
ఆహారం తీసుకునేటప్పుడు మనకు ఏది మంచిది ఏది చెడు అనే దాని పై పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది.

పెరుగు, ఊరగాయలు, మజ్జిగ, పులిసిన పిండితో చేసిన ఇడ్లీ లాంటి ప్రో బయోటిక్ ఆహారాలు ప్రేగులకు చాలా మంచిగా పరిగణిస్తారు.ఇవి ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడతాయి.వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి.
జీర్ణక్రియను పెరుగుపరచడంతో పాటు గ్యాస్ ను తగ్గిస్తాయి.ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు రాగులతో పాటు ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ లలో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

పోషకాలు ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల ఇవి వల్ల మలబద్దకాన్ని నివారిస్తాయి.మీ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆపిల్స్, బెర్రీలు, ఖర్జూరాలు, ఉసిరికాయ, నారింజ వంటి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.ఎందుకంటే ఇందులో ఫైబర్ పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.అధిక మొత్తంలో నీరు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే పప్పు దినుసులను ఉండేటప్పుడు రెండు నుంచి మూడు గంటల్లో నీటిలో నానబెట్టడం మంచిది.ఇంకా చెప్పాలంటే పప్పు దినుసులను సరిగ్గా ఉడికించకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.