ఎన్టీఆర్ క్రమశిక్షణకు హరికృష్ణ, బాలకృష్ణ ఎలా బలయ్యారో తెలుసా..?

తెలుగు సినిమా పరిశ్రమ పై ఎన్టీఆర్ గారు తనదైన చెరగని ముద్ర వేశారు.ఆయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా తర్వాత తరం వాళ్లు తీసే సినిమాలకి మార్గదర్శకంగా కూడా మారాయి.

 Sr Ntr Unknown Facts About His Commitment, Ntr, Balakrishna, Harikrishna, Nandha-TeluguStop.com

అలాంటి సినిమాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించిన ఎన్టీఆర్ చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది.ఎన్టీఆర్ చాలా సినిమాల్లో తనదైన నటనను ప్రదర్శించి థియేటర్లో జనాలు అందరి చేత చప్పట్లు కొట్టించుకునేవాడు ఇదిలా ఉంటే ఒకప్పుడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సెట్ లో ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడితే ఆయనకు అస్సలు నచ్చదు ఎందుకంటే రాజకీయ అనేది ఒక పెంట లాంటిది అక్కడ ఉండే రాజకీయ నాయకులంతా అబద్ధపు హామీలు ఇస్తూ జనాలను మోసం చేస్తూ ఉంటారు అనే మైండ్ సెట్ తో ఎన్టీఆర్ గారు ఉండేవారు.

కానీ అనతి కాలంలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారు.రాజకీయ నాయకులు, రాజకీయం అంటే చెడు అభిప్రాయం ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అంటే అప్పటికే రోనాల్డ్ రీగన్ అనే యాక్టర్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, అలాగే ఎం జె ఆర్ తమిళనాడు సీఎం అయ్యాడు మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి జనానికి ఏదైనా మంచి చేయాలి అనే ఉద్దేశంతో అలా ఆ వైపు ఆయన దృష్టి మళ్లింది అని ఆయన చాలాసార్లు చెప్పారు.

రాజకీయం పక్కన పెడితే ఆయన సినిమాల్లో హీరోగానే కాకుండా సినిమా డైరెక్షన్ కూడా చేశారు ఆయనకు బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి అనే ఇద్దరు దర్శకులు సినిమాలు చేస్తున్నప్పుడు ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తే వీళ్ళలానే చేయాలి అని అనుకునేవారట, అలా వాళ్ల స్ఫూర్తితో సీతారాముల కళ్యాణం అనే సినిమాని తీశారు.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఇంకా కొన్ని సినిమాలు డైరెక్షన్ చేశాడు ఎన్టీఆర్ డె టైం లో వేరే దర్శకుల సినిమాల షూటింగ్లో పాల్గొంటూ నైట్ టైం లో ఆయన సొంత డైరెక్షన్ చేసుకున్న సినిమాలో నటించేవాడు.

ఇప్పుడున్న హీరోలు డైరెక్టర్ల కి సలహాలు ఇస్తూ మార్పులు,చేర్పులు చేయమంటున్నారు కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే ఇతర డైరెక్టర్ల సినిమాల్లో నటించేటప్పుడు డైరెక్టర్ తీసే సీను తప్పుగా అనిపించిన ఎన్టీఆర్ చెప్పేవారు కాదట డైరెక్టర్ ఏదైతే అనుకుని మనకు చెప్తారో అది చేయడం మాత్రమే మన బాధ్యత అని చాలాసార్లు చెప్పారట .అలాగే ఆయన డైరెక్షన్ చేసిన సినిమా షూటింగ్ జరిగే ముందు రోజే దాంట్లో నటించే నటీనటులకు స్క్రిప్ట్ కి సంబంధించిన డైలాగులు వాళ్ల ఇంటికి పంపించేవాడట దాంతో వాళ్లు సెట్ కి వచ్చే ముందే డైలాగులన్నీ ప్రాక్టీస్ చేసుకుని రావాలని చెప్పేవారు.అలా చేయడం వలన షూటింగ్ స్పాట్ లో ఎక్కువ టేక్ లు తీసుకోకుండా తొందరగా నటించడానికి వీలు అవుతుంది అని అలా చేసేవాడట.

Telugu Balakrishna, Hari Krishna-Telugu Stop Exclusive Top Stories

ఒక్కోసారి అలా చేసినా కూడా డైలాగులు సరిగ్గా చెప్పకపోవడంతో కొందరి వల్ల షూటింగ్ లేట్ అవుతుండేది, అలాంటప్పుడు ఎన్టీఆర్ కోపానికి వచ్చేవారు తను డైరెక్ట్ చేసే సినిమా షూట్ హరికృష్ణ ,బాలకృష్ణ లాంటి వాళ్లు డైలాగులు సరిగ్గా చెప్పకపోవడంతో లేట్ అయిన క్రమంలో వాళ్లను కూడా తిట్టేవారట.అయితే కొన్ని సందర్భాల్లో ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు కూడా ఒకేసారి చేయవలసి వచ్చేది అలాగే దాన వీర శూర కర్ణ, చాణక్య చంద్రగుప్త వంటి సినిమాలు రెండు ఒకేసారి షూటింగ్ చేసేవారు అలా చేసిన క్రమంలో కూడా ఆయన చాలా బాగా చేస్తూ టీం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు.రెండు సినిమాలు కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి.

అప్పట్లో అందరికీ పెద్ద డౌటు ఉండేది ఎన్టీఆర్ గారు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, ఆయన డైరెక్ట్ చేసే సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు చేస్తూ, సినిమాని డైరెక్ట్ ఎలా చేస్తున్నారు అని చాలామంది అనుకునే వారు కానీ ఆయన అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ సినిమా షూట్ చేసుకునేవారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube