ఈ ఒక్క స్మూతీ డైట్ లో ఉంటే చాలు బోలెడు జబ్బులకు దూరంగా ఉండవచ్చు!

ఆరోగ్యం పై ప్రతి ఒక్కరికి ప్రత్యేక శ్రద్ధ ఉండాలని నిపుణులు పదేపదే చెబుతూ ఉంటారు.

ఆరోగ్యం( health ) సరిగ్గా లేకుంటే ఎంత సంపద ఉన్నా వృధానే.

అందుకే ఎంత బిజీ లైఫ్ స్టైల్ తో ప‌రుగులు పెడుతున్నా హెల్త్ విషయంలో ఖచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీ డైట్( Smoothie Diet ) లో ఉంటే బోలెడు జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు స్ట్రాబెర్రీలను( Strawberries ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఆరెంజ్ పల్ప్, అర కప్పు దానిమ్మ గింజలు, ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia seeds ) ను మిక్స్ చేసుకోవాలి.ఈ స్మూతీని రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ ఫ్రూట్స్ స్మూతీని తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి.ఈ స్మూతీ మిమ్మల్ని రోజు మొత్తం ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టం( immune system ) పెరుగుతుంది.సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.చర్మం ఆరోగ్యంగా నిగారింపు గా మారుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

జుట్టు రాల‌డం తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

Advertisement

చాలామంది రక్తహీనత సమస్యతో( anemia ) తీవ్రంగా సతమతం అవుతుంటారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా పైన చెప్పుకున్న స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.నిత్యం ఈ ఫ్రూట్స్ స్మూతీని తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

దాంతో రక్తహీనత ప‌రార్ అవుతుంది.అంతేకాదు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.

గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

తాజా వార్తలు