వేసవికాలం ప్రారంభమైనందువలన ఉష్ణోగ్రతలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.ఈ సీజన్లో హైడ్రేట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.
అందుకే వాటర్ కంటెంట్ ఉండే కూరగాయలను తీసుకుంటూ ఉంటారు.చాలామంది ప్రజలు కీర దోసకాయ( Cucumber ) కూడా తీసుకుంటూ ఉంటారు.
దోసకాయలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది.అలాగే దీన్ని తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
దీన్ని తీసుకోవడం వలన కండరాలు, నరాలకు శక్తి అందుతుంది.

అంతేకాకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా ఇది తొలగిస్తుంది.అది మాత్రమే కాకుండా దోసకాయ తినడం ఆరోగ్యపరంగా చాలా రకాలుగా మేలు చేస్తుంది.అయితే దోసకాయ తినడం వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.దోసకాయతో కొన్ని పదార్థాలను కలిపి అస్సలు తీసుకోకూడదు.
ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.చాలామంది దోసకాయ, టమాటో( Tomato ) రెండిటిని సలాడ్లో కలిపి తీసుకుంటారు.
ఆరోగ్యపరంగా ఇది సరైన ఫుడ్ కాంబినేషన్ అయితే అస్సలు కాదు.ఈ రెండు జీర్ణం( Digestive Health ) అయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

అందుకే వీటిని కలిపి తీసుకోవడం మానుకోవాలి.ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరంలోని ఆమ్లా పీహెచ్ ని అసమతుల్యత చేస్తుంది.ఇది కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.ఇక దోసకాయ ముల్లంగిని కూడా సలాడ్లో చాలామంది కలిపి తీసుకుంటూ ఉంటారు.ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి కచ్చితంగా హాని కలిగిస్తుంది.ఎందుకంటే దోసకాయలో ఆస్కార్బెట్ ఉంటుంది.
ఇది విటమిన్ సి ని గ్రహించేలా పనిచేస్తుంది.

అలాంటి సమయంలో ముల్లంగి( Radish )ని దానితో కలిపి తీసుకుంటే అది ప్రక్రియలో అడ్డంకిని సృష్టిస్తుంది.దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఇక చాలామంది పండ్లు, పాలతో కలిపి తీసుకుంటూ ఉంటారు.
అది హెల్తీ ఫుడ్ అని అందరూ అనుకుంటారు.కానీ అది ఒక పొరపాటు.
పాలు ఒక భేదిమంది.దోసకాయ, పాలు( Milk ) కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ఇబ్బందులు తలెత్తుతాయి.
దీని వలన వాంతులు, డయేరియాకు కారణం అవుతుంది.