బాన పొట్టతో బాధపడుతున్నారా.? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? సన్నగా మారాలని ఆశ పడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు వరమే అవుతుంది.రోజు ఉదయం టీ కాఫీలకు (Tee , coffee) బదులు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.మీరు కోరుకున్నట్లుగానే మీరు నాజూగ్గా మారతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు కుంకుమపువ్వు రేకులు(Saffron petals), ఐదు మెత్తగా దంచిన యాలకులు(elaichi), హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం(Ginger) తురుము మరియు అంగుళం ములేటి రూట్ వేసుకొని మూత పెట్టి మరిగించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి(Cow ghee) వేసి బాగా మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.రోజు ఉదయం టీ, కాఫీ వంటి పానీయాలకు బదులు ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం వెన్నల కరిగిపోతుంది.కొద్దిరోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.మీరు సన్నగా తయారవుతారు.అలాగే ఈ డ్రింక్ బాడీని డీటాక్స్ చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.
ఓవర్ వెయిట్ నుంచి బయటపడడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.