సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.పోషకాల కొరత, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంటుంది.
దీని కారణంగా జుట్టు ఊడుతుంది కానీ మళ్ళీ కొత్త జుట్టు రాదు.ఫలితంగా ఒత్తైన జుట్టు పలుచగా( Thin Hair ) మారిపోతుంటుంది.
ఇక అప్పుడు హైరానా పడిపోతుంటారు.జుట్టు ని మళ్ళీ ఎలా ఒత్తుగా మార్చుకోవాలో తెలియక ఆగమాగం అవుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు నుంచి మూడు జామ ఆకులను( Guava Leaves ) తుంచి వేయాలి.
అలాగే రెండు బిర్యాని ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత రెగ్యులర్ షాంపూను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జామ ఆకు, బిర్యాని ఆకు మరియు వైట్ రైస్ లో ఉండే ప్రత్యేక గుణాలు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.

హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అంతేకాదు పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకుంటే చుండ్రు సమస్య ఉన్నా సరే దూరం అవుతుంది.కాబట్టి తమ జుట్టు పలుచగా ఉందని బాధపడుతున్న వారు.హెయిర్ గ్రోత్ లేదని వర్రీ అవుతున్న వారు.
తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







