మహిళలకు ఎలాంటి పుట్టుమచ్చలు ఉంటే మంచిది?

శరీరంపై పుట్టుమచ్చల గురించి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పబడింది.పుట్టుమచ్చలు కొందరికి అందాన్ని తెస్తే మరికొందరికి ఐశ్వర్యాన్ని తెస్తాయి.

 What Kind Of Moles Lucky For Women,birth Mole, Spiritual Science, Belief Of Hind-TeluguStop.com

ముఖ్యంగా శరీరంలో ఏ ఏ ప్రాంతాలలో పుట్టుమచ్చలుంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

స్త్రీకి ఎరుపు రంగు పుట్టమచ్చ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటే, ధన ప్రాప్తి కలిగి, మంచి సంతానం కలుగుతుంది.

ఎర్రని మచ్చలు వల్ల ఎల్లప్పుడూ శుభ ఫలితాలే కలుగుతాయి.

స్త్రీకి చేతుల మీద కానీ లేదా నుదిటిపై ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే వీరికి పుత్రసంతానం కలుగుతుంది.

నుదిటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదనను కలిగి ఉంటారు.అలాగే నుదిటి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే వీరికి సాధారణ ఫలితాలు కలుగుతాయి.

ఏ స్త్రీకి ఎడమ కడత పై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన నడవడికలను కలిగి ఉంటారు.కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే వీరు భర్త మాటకు గౌరవించి భర్త అడుగు జాడల్లోనే నడుచుకుంటారు

Telugu Belief Hindus, Mole, Mole Science-Telugu Bhakthi

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనులలో పట్టుదల, ఆసక్తిని కనబరుస్తారు అలాగే ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు ధనవంతులై సకల సంతోషాలతో కలిగి ఉంటారు.వీరికి కలిగిన సంతానం అభివృద్ధి బాటలో నడుస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

స్త్రీలకు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వీరికి ధిక్కార స్వభావం కలిగి ఉంటారు.

బంధుమిత్రులతో అనవసరమైన తగాదాలను పెట్టుకుంటారు.అలాగే స్త్రీలకు ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వారికి చేతి నిండా ధనం కలిగి ఉంటారు మనసులో పరిమితమైన కోరికలను కలిగి ఉంటారు.

అయితే పుట్టుమచ్చ కుడి మోచేతి మీద ఉంటే మొదట్లో కష్టాలు ఉన్నా ధైర్యంగా నిలబడే స్వభావం కలిగి ఉండటం వల్ల వీరు సుఖాలను అనుభవించగలరు.తమను తాము రక్షించుకోగలరు.

వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.

స్త్రీల చేతులపై దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది.

సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube