అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.హ్యాట్రిక్ ఫ్లాప్ లతో డీలా పడ్డ అతనికి హిట్ ఇవ్వడానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ సిద్ధమైంది.
బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ పరిచయం చేస్తుంది.ఈ సినిమా మీద అఖిల్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.ఇక ఇందులో అఖిల్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయబోతున్నాడు.
ఈ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్న అఖిల్ తన నెక్స్ట్ సినిమాని మరల కమర్షియల్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే చేసేందుకు సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడుని రెడీ చేసుకున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది.
తాజాగా ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది.
ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి సినిమాలో అఖిల్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్ వేటలో పడింది.
అయితే హీరోయిన్ గా కొత్తవాళ్ళు,బాలీవుడ్ హీరోయిన్స్ కంటే రష్మిక బెస్ట్ ఛాయస్ అని భావిస్తున్నట్లు టాక్.ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి రైజింగ్ లో ఉన్న రష్మిక అయితే సినిమాకి యూత్ లో క్రేజ్ కూడా వస్తుందని చిత్ర యూనిట్ భావించి ఆమెని ఎంపిక చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
రష్మిక కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం.త్వరలో హీరోయిన్ కి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.రష్మిక ఇందులో కన్ఫర్మ్ అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న పూజ హెగ్డే, రష్మికతో వరుస సినిమాలలో జత కట్టిన కుర్ర హీరో అఖిల్ అవుతాడు.మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు సెట్ అవుతుందనేది వేచి చూడాలి.