హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!

సాధారణంగా కొందరిలో హెయిర్ బ్రేకేజ్(Hair breakage) అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.రెగ్యులర్ గా తల స్నానం చేయడం, వేడి వేడి నీటిని ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ (Hair styling tools)ను అధికంగా వాడటం, పోషకాల కొరత, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు అనేది బలహీనంగా మారుతుంది.

 This Is The Best And Natural Tonic To Check Hair Breakage! Hair Breakage, Hair T-TeluguStop.com

ఫలితంగా హెయిర్ బ్రేకేజ్ సమస్య ఎక్కువవుతుంది.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఒకటి ఉంది.

దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు(Curry Leaves), నాలుగు మందారం ఆకులు(Hibiscus hair ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు(Fenugreek Side ) మరియు రెండు బిర్యానీ ఆకులు(Biryani leaves) వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మెంతులు, కరివేపాకు, మందారం ఆకులు, బిర్యానీ ఆకు నానబెట్టుకున్న గిన్నెను పెట్టి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.

గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Breakage, Care, Care Tips, Tonic, Healthy, Natural Tonic-Telugu Health

ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో ఫీల్ చేసుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.

జుట్టు రాలడం మరియు విరగడం సమస్యలు తగు ముఖం పడతాయి.హెయిర్ సూపర్ స్ట్రాంగ్ గా, హెల్తీగా మారుతుంది.

Telugu Breakage, Care, Care Tips, Tonic, Healthy, Natural Tonic-Telugu Health

అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.ఇక హెయిర్ బ్రేకేజ్ ను అడ్డుకునేందుకు ఈ టానిక్ ను వాడడంతో పాటు తప్పకుండా మంచి డైట్ ను మెయింటైన్ చేయండి.తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, సీడ్స్, చేపలు, పాలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో భాగం చేసుకోండి.

ఇవి ఆరోగ్యాన్నే కాకుండా జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube