స‌గ్గుబియాన్ని ఎలా త‌యారు చేస్తారు.. అది అందించే ప్ర‌యోజ‌నాలేంటి?

స‌గ్గుబియ్యం(sabudana).దాదాపు అంద‌రి వంటింట్లోనూ ఉంటాయి.

 How Is Sabudana Made? Sabudana, Sago, Saggubiyyam, Saggubiyyam Health Benefits,-TeluguStop.com

తెల్ల‌గా చూడ‌టానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే స‌గ్గుబియ్యం మొక్కలకు పండుతుందని చాలా మంది అనుకుంటారు.కానీ వాస్త‌వానికి స‌గ్గుబియ్యం పరిశ్రమలలో తయారవుతుంది.

కర్ర పెండలం (Stick pendulum)దుంప‌ల‌తో స‌గ్గుబియ్యాన్ని చేస్తారు.చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్ధతిలోనే క‌ర్ర పెండ‌లం దుంపల నుండి పాలను తీస్తారు.

ఈ పాలు ఫిల్టర్స్‌లోకి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోకి పంపుతారు.ఈ క్రమంలో పాలలోని చిక్కని పదార్థం ముద్దలా మారుతుంది.

దానితోనే సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారు.

సగ్గుబియ్యంతో ప్ర‌ధానంగా పాయసం, కిచిడి, ఉప్మా, జావ‌, వడలు, జ్యూస్ (Payasam, Khichdi, Upma, Java, Vadalu, Juice)తయారు చేస్తుంటారు.

ఆరోగ్య ప‌రంగా స‌గ్గుబియ్యం చాలా ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.ముఖ్యంగా వేస‌వి కాలంలో స‌గ్గుబియ్యం ఉత్త‌మంగా ఆహారంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది.ఎందుకంటే, సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి.స‌గ్గుబియ్యం జావ‌ను(sabudana Javanese) స‌మ్మ‌ర్ లో తీసుకుంటే ఒంట్లో అధిక వేడి మాయం అవుతుంది.

బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

Telugu Tips, Latest, Saggubiyyam, Sago, Sago Benefits-Telugu Health

అలాగే కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉండ‌టం వ‌ల్ల స‌గ్గుబియ్యం శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇస్తుంది.బ‌ల‌హీనంగా ఉన్న‌వారికి, వ్యాయామం చేసే వారికి స‌గ్గుబియ్యం మంచి ఆహార ఎంపిక అవుతుంది.స‌గ్గుబియ్యంలో ఐర‌న్ మెండుగా ఉంటుంది.

అందువ‌ల్ల హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో, ర‌క్త‌హీన‌త‌ను దూరం చేయ‌డంలో స‌గ్గుబియ్యం స‌హాయ‌ప‌డ‌తాయి.కొలెస్ట్రాల్ లేనందున హృదయ ఆరోగ్యానికి కూడా స‌గ్గుబియ్యం తోడ్ప‌డ‌తాయి.

Telugu Tips, Latest, Saggubiyyam, Sago, Sago Benefits-Telugu Health

అంతేకాదండోయ్.గర్భిణులకు స‌గ్గుబియ్యం చాలా మేలు చేస్తాయి.స‌గ్గుబియ్యం జావ‌ను త‌ర‌చూ తీసుకుంటే గ‌ర్భిణీ స్త్రీల‌లో ఉద్వేగం, ఒత్తిడి తగ్గుతాయి.ఎక్కువ క్యాలరీలున్న ఈ ఆహారం బరువు పెరగాలనుకునే వారికి ఉపయోగకరం.వెయిల్ గెయిన్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌వారు స‌గ్గుబియ్యాన్ని త‌మ రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకోవ‌చ్చు.ఇక స‌గ్గుబియ్యం తేలికగా జీర్ణమవుతుంది.

కాబ‌ట్టి, గ్యాస్, అసిడిటీ, అల్సర్ ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube