చిన్న పిల్లాడు(Little boy), ఇంకా నడక కూడా సరిగ్గా రాని వయసు.అలాంటి పిల్లాడు బిజీ రోడ్డుపై రాంగ్‌రూట్‌లో బైక్ రైడింగ్ (Bike riding in a rut on a busy road)చేస్తూ కనిపించాడు.ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘సెకండ్స్ బిఫోర్ డిజాస్టర్’ అనే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా చూశారు.5,500 లైక్స్‌తో దూసుకుపోతోంది.
వీడియోలో మొదట పిల్లాడు రోడ్డు పక్కన సైడ్‌కి వెళ్తూ కనిపించాడు.
కానీ వీడియో కొనసాగుతుండగానే, నెమ్మదిగా రోడ్డు మధ్యలోకి వచ్చేశాడు.అక్కడ వాహనాలు మాత్రం దూసుకుపోతున్నాయి.
కార్లు, ఇతర వెహికల్స్ డేంజరస్‌గా పిల్లాడి దగ్గర నుంచి వెళ్తున్నాయి.ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది.
పిల్లాడికి ఏమవుతుందో అని అందరూ భయపడిపోయారు.వీడియో చూస్తున్న వాళ్లకి అయితే నోట మాట రాలేదు.
అదృష్టం బాగుండి పిల్లాడికి ఏమీ కాలేదు.వీడియో చివర్లో ట్రాఫిక్ పోలీస్(Traffic Police) ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చాడు.
వెంటనే పిల్లాడిని ఎత్తుకుని, బైక్‌తో సహా రోడ్డు పక్కకు తీసుకెళ్లి సేఫ్ చేశాడు.ఊపిరి పీల్చుకున్నారంతా!

ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.చాలా మంది భయంతో, ఆందోళనతో కామెంట్స్ పెడుతున్నారు.“ఎవరైనా ట్రాఫిక్ ఆపి పిల్లాడిని కాపాడతారని అనుకున్నా, కానీ ఎవరూ పట్టించుకోలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.“నేను చూసిన వాటిల్లో ఇదే భయంకరమైన వీడియో.నాకు ఊపిరి ఆడలేదు” అని ఇంకొకరు రాశారు.కొందరు ఫన్నీగా కూడా స్పందించారు.“బ్రో లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్టున్నారు” అంటూ ఒక యూజర్ జోక్ చేశాడు.ఈ వైరల్ వీడియో రోడ్డు భద్రత, తల్లిదండ్రుల బాధ్యత గురించి కొత్త చర్చకు దారితీసింది.ఇంత బిజీ రోడ్డుపై ఇలాంటి ఘటన ఎలా జరిగిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
ట్రాఫిక్ ప్రమాదాల గురించి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం గురించి ఈ వీడియో సీరియస్‌గా గుర్తు చేస్తోంది.







