గత కొంత కాలం గా నాగ చైతన్య( Naga Chaitanya ) హీరో గా నటిస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం.వరుసగా ఆరు హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్న నాగ చైతన్య కి ‘థాంక్యూ’( ‘thank you’ ) అనే సినిమా పెద్ద బ్రేక్ వేసింది.
ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా అదే రేంజ్ ఫ్లాప్ అయ్యింది.దీంతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురి అయ్యారు.
నాగ చైతన్య మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి అక్కినేని అభిమానులకు కిక్ ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.సినిమాల పరంగా ఆయన పెద్ద కం బ్యాక్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ.
రీసెంట్ గా ‘దూత’ ( dootha )అనే వెబ్ సిరీస్ తో మాత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించాడు.ఆసక్తికరమైన కథ స్క్రీన్ ప్లే తో ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠ కలిగించేలా ఈ సిరీస్ కి పేరొచ్చింది.

లాభాలు కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రావడం తో నాగ చైతన్య కి ముందు అనుకున్న దానికంటే అధిక రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ సంస్థ( Amazon Prime ).ముందు కుదరించుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ వెబ్ సిరీస్ చేసినందుకు గాను నాగ చైతన్య కి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేసారు.కానీ ఇప్పుడు ఆ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఊహించిన దానికంటే అధిక లాభాలు రావడం తో మరో 5 కోట్ల రూపాయిలు అదనంగా ఇచ్చారట.ఇప్పటి వరకు నాగ చైతన్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు కానీ, ఒక్కటంటే ఒక్క చిత్రానికి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోలేదు.
అలాంటిది వెబ్ సిరీస్ కి అందుకున్నాడంటే నాగ చైతన్య కి జాక్పాట్ తగిలింది అనే చెప్పాలి.డెబ్యూ సిరీస్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం తో, ఇక మీదట కూడా ఇలాంటి వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాగ చైతన్య.

ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’( Tandel ) అనే చిత్రం లో నటిస్తున్నాడు.గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ నాగ చైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది.గుజరాత్ జాలరుల నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ ని మరో స్టేజికి తీసుకెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు.