సనాతన ధర్మంలో అమావాస్య తిధికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.అమావాస్య సోమవారం లేదా శనివారం వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాముఖ్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఏప్రిల్ మాసంలో అమావాస్య ఎనిమిదవ తేదీన సోమవారం వచ్చింది.అందువల్ల దీన్ని సోమవతి అమావాస్య( Somavathi Amavasya ) అని పిలుస్తారు.
అమావాస్యతో పాటు ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది.అయితే ఈ సూర్య గ్రహణం( Solar Eclipse ) మన దేశంలో కనిపించదు.
సుమారు 54 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో సూర్యుడు సుమారు ఏడున్నర నిమిషాల పాటు కనిపించడు.మన దేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం రాత్రి వేళా ఏర్పడుతుంది.అదే సమయంలో అమావాస్య తిధి కూడా ఉంటుంది.
ఏప్రిల్ 8వ తేదీన తెల్లవారు జామున 3గంటల 21 నిమిషముల నుంచి అదే రోజు రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సూర్యగ్రహణం ముగిస్తుంది .అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయాలి.నది స్నానం( River Bath ) ఆచరించలేని వాళ్లు గంగాజలన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి.

ఆ రోజు సూర్య దేవునికి( Surya Bhagawan ) అర్ఘ్యం సమర్పించాలి.శివ పర్వతలను ఆరాధించాలి.అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల గృహ దోషాలు, అలాగే అనేక బాధల నుంచి విముక్తి పొందవచ్చు.
అమావాస్య రోజు పచ్చి పాలను రావి చెట్టుకు సమర్పించడం ఎంతో మంచిది.రావి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.తమలపాకులు,పసుపు తులసి మొక్కకు సమర్పించాలి.మధ్యాహ్నం సమయంలో నువ్వులు నీళ్లలో కలిపి దక్షిణం వైపు తిరిగి స్మరించుకుంటూ ఆ నీటిని వదలాలి.
అలాగే ఆ రోజు రావి చెట్టు కింద సాయంత్రం వేళ దీపం వెలిగించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.