కుక్కలు, పిల్లులు, పక్షులు, చేపలు ప్రజల ఎంపికలో మొదటి జాబితాలో ఉంటాయి.అయితే ఇంట్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ కూడా పిల్లిని అసలు ఇష్టపడనీ వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు.
పిల్లుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు కూడా చూపిస్తున్నాయి.అయితే ఇంట్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపిస్తుందని అర్థం.
అలాగే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూల శక్తి సులభంగా ప్రవేశించడానికి వీలు ఉండదని కూడా చెబుతూ ఉంటారు.అయితే మీ ఇంటికి చెడు వచ్చే ముందు పిల్లి మీకు సూచనలను ఇస్తుంది తెల్ల పిల్లి( White Cat ) మీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది మీకు పని నుండి విరామం ఇవ్వమని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి.

కాబట్టి పని నుండి మీరు విరామం తీసుకోవాలి.కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా పిల్లిని ఇంట్లో పెంచుకోవడం వలన మంచి నిద్రకు దారితీస్తుంది.అలాగే ఇంట్లో పిల్లిని కలిగి ఉండడం వలన అనేక భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అయితే ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే వాటిని అక్కడి నుండి తరమకూడదు.
ఎందుకంటే పిల్లి తన పిల్లలని తీసుకొని ఏడు ఇల్లు తిరుగుతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.కాబట్టి ఎక్కువ రోజులు అవి మీ ఇంట్లో ఉండవు.
అవి మిమ్మల్ని ఎలాంటి హాని కలిగించవు.కాబట్టి వాటిని తరమకుండా ఉండడమే మంచిది.

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇంట్లోకి వచ్చి పిల్లి పిల్లల్ని( Kitten ) పెట్టింది అంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయని అర్థం చేసుకోవాలి.అలాగే మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని కూడా అర్థం చేసుకోవాలి.ఇది డబ్బు రాకకు కూడా సంకేతం.లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలోనే రాబోతుందని కూడా దీనికి అర్థం.ఇక తల్లి పిల్లి వాటి పిల్లను ఎప్పుడు సుఖంగా ఉండే విధంగా నాలుకతో వాటిని శరీరాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది.మీ ఇంట్లో ఈ విధంగా పిల్లులు తిరుగుతూ ఉంటే వాటిని చూసి మానసిక ఒత్తిడి( Mental stress ) కూడా తగ్గుతుంది.
కాబట్టి ఇంట్లో పిల్లిని పెంచుకోవడం వలన మీకు ఎలాంటి హాని కలగదు.అలాగే ఎలాంటి అశుభం ఉండదు.
అలాగే ఇంట్లో పిల్లులు పిల్లలు పెట్టడం వలన మీకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.