మన భారతదేశ సనాతన ధర్మంలో శంఖానికి ఎంతో ప్రత్యేకత ఉంది.మన పురాణాలలో మహావిష్ణువు( Lord Vishnu ) కూడా అనేక సందర్భాలలో శంఖాలను ధరించాడు.
మహాభారతంలో శ్రీకృష్ణుడు( Lord Krishna ) పాంచజన్యం అనేటటువంటి శంఖమును ఉపయోగించడం కూడా శంఖము ప్రాధాన్యతను తెలియజేస్తాయనీ పండితులు చెబుతున్నారు.శివునికి చేసే అభిషేకాలలో శంఖం ద్వారా నీటిని పోసి అభిషేకం చేయడం ఎంతో శ్రేష్టముగా భావిస్తారు.
శంఖము ద్వారా కూడా తీర్ధాన్ని అందజేస్తారు.శంఖన్ని లక్ష్మీ స్వరూపమని, పాల సముద్రంలో లక్ష్మీదేవితో( Goddess Lakshmi ) పాటు శంఖము ఆవిర్భవించినట్లుగా పురాణాలలో ఉంది.
అందుకే శంఖాన్ని లక్ష్మీ స్వరూపముగా కూడా భావిస్తారు.

శంఖం ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకునేవారు ఆరోగ్యముగా ఉంటారని పండితులు చెబుతున్నారు.తులసి తో కూడిన సాలగ్రామ తీర్థములను శంఖము ద్వారా స్వీకరించిన రోగాలు దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.దక్షిణావర్త శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదతో లక్ష్మి దేవి నివసిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే చాలామంది పూజలలో ఈ శంఖాన్ని ఉంచుతారు.పుణ్య దినమున ఇంటిలో పూజ చేసి దేవతార్చనలో శంఖాన్ని ఉంచాలి.
శ్రీరామనవమి, విజయదశమి, గురు పుష్పమి, రవి పుష్యమి,పుణ్య నక్షత్రములు, పుణ్య తిధులు ఉన్న పర్వదినములలో తప్పకుండా పూజ చేయాలి.

ముఖ్యంగా చెప్పాలంటే సాత్విక పూజలో, యజ్ఞాలలో ఉపయోగపడే శంఖము వివిధ పరిమాణాలలో, ఆకారాలలో ఉపయోగిస్తారు.బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇది వరకు క్షత్రియులు, వైశ్యులు కూడా శంఖాన్ని ఉపయోగించేవారు.
ఈ శంఖాలు సముద్రంలో తేలుతూ సులభంగా లభిస్తాయి.తెల్లటి శంఖాలు మంచి ఆకారంలో ఉండడమే కాకుండా వీటిని పవిత్రమైన భావిస్తారు.
కుడివైపును తెరచి ఉన్న శంఖాన్ని దక్షిణావృత శంఖము అని పిలుస్తారు.ఈ శంఖాన్ని ఉదితే చక్కని ధోని వస్తుంది.
రామాయణ, మహాభారతలలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
DEVOTIONAL