వైరల్: కుండ దోశెను ఎపుడైనా తిన్నారా? ఇదిగో ఇలాగే ఉంటుంది!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా మనకు ఫుడ్ కి( Food ) సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనబడతాయి.ఎందుకంటే, మనిషి సహజ సిద్ధంగానే భోజన ప్రియుడు కాబట్టి.

 Man Prepares Cheesy Matka Dosa Video Viral Details, Kunda Dosa, Viral Latest, N-TeluguStop.com

పైగా ఆశాజీవి, కళాకారుడు.అందుకే మనం రకరకాల రుచులను రుచి చూడాలని తహతహలాడుతూ ఉంటాం.

ఈ క్రమంలోనే ఎన్నో రకాల రెసిపీస్ పుట్టుకొచ్చాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో రెసిపీ మనల్ని ఊరిస్తూ ఉంటుంది.

ఇక మనకి అందుబాటులో ఎన్ని ఆహార పదార్ధాలు వున్నా దోశది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోక తప్పదు.

ఎందుకంటే మనుషులు, అందునా భారతీయులు దాదాపుగా మార్నింగ్ టిఫిన్లో భాగంగా దోశనే( Dosa ) తినడానికి మొగ్గు చూపుతారు.

ఎందుకంటే అని అడిగితే ఏం చెప్పేది.దాని రుచి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే మనుషులకు ఇష్టమైన ఈ ఆహారాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేసి ఊరిస్తూ వుంటారు.ఇంకేముంది కట్ చేస్తే మనం వాటిని తినకుండా ఉండలేం.

ఈ క్రమంలోనే ఏకంగా కొన్ని చోట్ల దోశ దర్బారులు అంటూ వెలిసాయి.

మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉప్మా దోశె, పనీర్ దోశె… ఇలా రకరకాల దోశలు అందుబాటులో ఉన్నాయి ఇపుడు.ఇపుడు సోషల్ మీడియాలో కూడా అదే దోశ గురించి చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.అలాంటి దోశని మీరు బహుశా ఇంతకుముంది తిని వుండరు.

కానీ అది చూస్తేనే మీ నోరు ఊరిపోతోంది అంటే మీరు నమ్ముతారా? కావాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ఒకసారి తిలకించండి.

దీనిని చాలా స్పెషల్ గా తయారు చేసినట్టు కనబడుతొంది.ఇందులో బెల్ పెప్పర్స్, క్యాప్సికం, పనీర్, టమోటా సాస్, సోయా సాస్, మసాలాలు అన్ని వేసి ఒకసారి వేయించి ప్లేట్లో తీశారు.ఆ తర్వాత దోశను వేసి దోశెపై కూడా కూరగాయలు సాస్‌లు, మయోన్నెస్‌లు వంటివన్నీ వేసిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యాన్ని ఒక చిన్న కుండలో ( Pot ) వేసి, ఆ కుండపై దోశను కోన్ లాగా పెట్టి, ఆ కుండను ప్లేటుపై పెట్టి ఈ దోశెను సర్వ్ చేయడం చూస్తే మనం లొట్టలేయకుండా ఉండగలమా చెప్పండి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube