ఈ 3 ర‌కాల ఫుడ్స్‌ అతి ఆక‌లికి చెక్ పెట్టి బ‌రువును వేగంగా త‌గ్గిస్తాయి..తెలుసా?

అతి ఆక‌లి.చాలా మందికి ఇది చిన్న స‌మ‌స్య‌గానే క‌నిపిస్తుంది.

 These 3 Types Of Foods Control Extreme Hunger And Reduce Weight Fast! Foods, Ext-TeluguStop.com

కానీ, దీని వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ‌తాయి.అతి ఆక‌లి కార‌ణంగా నోటికి ఆపు లేకుండా ఏది ప‌డితే అది లాగించేస్తుంటారు.

దాంతో శ‌రీర బ‌రువు భారీగా పెరుగుతుంది.బ‌రువు పెరిగితే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, ర‌క్త‌పోటు ఇలా ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు ఇబ్బంది పెడ‌తాయి.

అందుకే అతి ఆక‌లిని అంత త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు.వీలైనంత త్వ‌ర‌గా దాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే మూడు ర‌కాల ఫుడ్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

పాప్ కార్న్.దాదాపు అంద‌రూ దీన్ని ఒక స్నాక్‌గానే చూస్తారు.కానీ, మొక్క‌జొన్న గింజ‌ల‌తో త‌యారు అయ్యే పాప్ కార్న్‌లో బోలెడన్ని పోష‌కాలు నిండి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా అతి ఆక‌లికి చెక్ పెడ‌తాయి.

రోజుకో క‌ప్పు పాప్ కార్న్‌ను తీసుకుంటే అతి ఆక‌లి త‌గ్గుతుంది.అదే స‌మ‌యంలో వేగంగా వెయిట్ లాస్ కూడా అవుతారు.

పుట్ట‌గొడుగులు.ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో విరి విరిగా ఇవి ల‌భ్య‌మ‌వుతుంటాయి.అయితే పుట్ట‌గొడుగుల‌కు అతి ఆక‌లి స‌మ‌స్య‌ను నివారించే సామ‌ర్థ్యంతో పాటు శ‌రీర బ‌రువును త‌గ్గించే గుణం కూడా ఉంది.అందుకోసం వారంలో రెండు సార్లు పుట్ట‌గొడుగుల‌ను తీనేందుకు ప్ర‌య‌త్నించాలి.

యాపిల్‌.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.రోజుకు ఒక యాపిల్ తింటే డాక్ట‌ర్ అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని అంటుంటారు.యాపిల్‌లో అన్ని అమోఘ‌మైన పోష‌కాలు ఉంటాయి కాబ‌ట్టే అలా అంటుంటారు.అయితే అతి ఆక‌లి స‌మ‌స్య‌కు సైతం యాపిల్ ఓ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.రెగ్యుల‌ర్‌గా ఒక యాపిల్ తింటే అతి ఆక‌లి స‌మ‌స్య‌ దూరం అవుతుంది.

వెయిట్‌ లాస్ కూడా అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube