పవన్ కల్యాణ్.! ఆ పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్స్, ఆయన సినిమా వస్తుందంటే వెలకట్టలేని ఆనందం.వెండితెరపై హీరోలందరికంటే ప్రత్యేకమైన వ్యక్తి.సినిమాలు రాజకీయాలతో సంబంధంలేకుండా కోట్లాదిమంది పవన్ ను ఆరాదిస్తారు.అలాంటి పవన్ ఏం చేసినా అది సెన్సేషనే అవుతుంది అభిమానులకు
ఇటీవల పవన్ కల్యాణ్ చాతార్మాస్య దీక్ష చేపట్టారు. హైందవ సాంప్రదాయంలో ఓ భాగమైన చాతుర్యాస్య దీక్షను నాలుగు నెలలపాటు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్ష చేశారు.
ఎంతో నిష్టనియమాలు కఠినంగా ఉన్న పవన్ నాలుగు నెలల పాటు అరుణోదయవేళ కు ముందే స్నానం చేయడం, వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస .ఉపనిషత్తును పఠించడంతో పాటు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయడంతో ఆ చాతుర్యాస్య దీక్ష విజయవంతంగా ముగిసింది
దీంతో పవన్ మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ అయ్యారు.దిల్ రాజు నిర్మాతగా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీ అయ్యారు.చిత్రీకరణలో భాగంగా పవన్ మదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోట్రైన్ లో ప్రయాణించారు.
పవన్ కల్యాణ్ మెట్రోలో ప్రయాణిస్తుండగా ఆయనతో పాటు పబ్లిక్ గుంపులు గుంపులుగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ప్రయాణంపై పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటికే దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైందని , మానవ తప్పిదం వల్లనే దీని ప్రమాదం పొంచి ఉందని సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా తెలిపిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.
పండగలు, పెళ్లిళ్లు, గుంపులుగా ఉండే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని.మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం ద్వారా వేవ్‌లను ఆలస్యం చేయవచ్చునని రాకేశ్ మిశ్రా తెలిపారు.
ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్ లో పవన్ పబ్లిక్ లో తిరగకుండా సేఫ్టీ మెథడ్స్ పాటించాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.