పొట్ట చుట్టు కొవ్వు.దీనిని బెల్లీ ఫ్యాట్ అని కూడా అంటుంటారు.చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతుంటారు.శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కారణంగా పొట్ట చుట్టు కొవ్వు ఏర్పడుతుంది.ఫలితంగా బట్టలు పట్టకపోవడం, అందహీనంగా కనిపించడం వంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది.వీటితో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టేస్తుంటాయి.
ముఖ్యంగా పొట్టచుట్టూ కొవ్వు అధికంగా ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అందుకే పొట్ట చుట్టు ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే పాలకూర జ్యూస్ పొట్ట చుట్టు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.విటమిన్ ఎ విటమిన్ సి, విటమిన్ బి, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, బీటా-కరోటిన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉండే పాలకూర ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
ఇక ముఖ్యంగా పొట్ట చుట్టు కొవ్వు కరిగించుకోవాలి అని భావించే వారికి పాలకూర గ్రేట్‌గా సహాయపడుతుంది.

ఒక కట్ట పాల కూరను శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీలో పాలకూర, చిన్న అల్లం ముక్క, వాటర్ వేసి బ్లెండింగ్ చెయ్యాలి.చివర్లో కొద్దిగా నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకుని తీసుకోవాలి.
ఇలా ప్రతి రోజు ఒక గ్లాస్ పాల కూర జ్యూస్ తీసుకుంటే.అందులో ఉండే ఐరన్ మరియు ఇతర పోషకాలు కండరాలకు ఆక్సిజన్ చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
దాంతో కండరాలు పొట్ట మరియు ఇతర భాగాల్లో అదనంగా పేరుకుపోయి ఉన్న కొవ్వును కరిగించేస్తాయి.
అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగుతుంది.
ఫలితంగా సీజనల్‌గా వచ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.ఇక గుండె జబ్బుల నుంచి రక్షించడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ, రక్త ప్రసరణ మెరుగు పరచడంలోనూ, నిద్రలేమి సమస్యను తగ్గించడంలోనూ పాలకూర జ్యూస్ ఉపయోగపడుతుంది.
కాబట్టి, పొట్ట చుట్టు కొవ్వు ఉన్న వారే కాదు.అందరూ పాలకూర జ్యూస్ ను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.