వియత్నాం( Vietnam ) వీధుల్లో చక్కర్లు కొడుతూ వీడియోలు తీస్తున్న ఓ వ్లాగర్‌కి( Vlogger ) ఊహించని పరిస్థితి ఎదురైంది.స్థానికురాలైన ఓ వియత్నామీస్ మహిళ( Vietnamese Woman ) ఆమెను చూసి “నువ్వు భారతీయురాలివి( Indian ) అంటే నేను నమ్మను” అనేసింది.
కృతి కర్మాకర్( Kriti Karmakar ) అనే ఆ వ్లాగర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది.నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే. “ఇండియన్ గర్ల్ ఇన్ వియత్నాం. యే క్యా హోగయా?” అంటూ క్యాప్షన్ పెట్టి కృతి కర్మాకర్ వీడియోను షేర్ చేసింది.“సెల్ఫీ దిగడానికి సడన్‌గా వచ్చింది” అంటూ వీడియో మొదలుపెట్టింది కృతి.ఆ వీడియోలో, వియత్నామీస్ మహిళ కృతి దగ్గరికి వచ్చి “మీరు ఎక్కడి నుంచి వచ్చారు?” అని అడిగింది.“నేను ఇండియా నుంచి” అని కృతి చెప్పగానే, ఆ మహిళ షాక్ అయిపోయి “నిజంగా ఇండియానా?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది.
కృతి చెప్పిన ప్రకారం, ఆ మహిళ మొదట ఆమె భారతీయురాలు అని నమ్మలేకపోయింది.కానీ, కాసేపు మాట్లాడిన తర్వాత, తనకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పిందట.
అంతేకాదు, ఇండియన్ ఫుడ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా చూపించిందట.

వియత్నామీస్ మహిళ మాత్రమే కాదు, చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా కృతిని చూసి ఆశ్చర్యపోయారు.“నువ్వు చూడటానికి టిపికల్ ఇండియన్ లా లేవు.నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి వచ్చావా?” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.“ఆమె భారతీయురాలు అయ్యే ఛాన్సే లేదు.నేను గ్యారెంటీగా చెప్పగలను” అని ఇంకొకరు అన్నారు.“ఇండియా ఎంత విభిన్నమైన దేశమో కదా, కానీ అందరూ భారతీయులంటే నల్లగా ఉంటారని అనుకుంటారు” అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.“వియత్నాం సంగతి దేవుడెరుగు, నువ్వు ఇండియన్ అంటే నేనే నమ్మలేకపోతున్నా.” అని ఇంకొక నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు.

కృతి కర్మాకర్ ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో BA చేసింది.అంతేకాదు, కొరియన్ భాషలో డిప్లొమా కూడా చేసింది.ఆమె సోషల్ మీడియాలో మాత్రం సూపర్ పాపులర్.ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.3 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.యూట్యూబ్‌లో తనను తాను “జపాన్‌లో ఉంటున్న ఇండియన్ అమ్మాయి” అని పరిచయం చేసుకుంది.ఫ్యాషన్, మేకప్, లైఫ్‌స్టైల్ గురించి వీడియోలు చేస్తూ ఉంటుంది.







