Hair fall : తల స్నానం చేసినప్పుడు జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఈ చిట్కా మీకోసం!

సాధారణంగా కొందరికి మామూలు సమయం తో పోలిస్తే తలస్నానం చేసే సమయంలో జుట్టు చాలా అంటే చాలా విపరీతంగా ఊడిపోతుంటుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలకుండా ఉండడం కోసం ఖరీదైన షాంపూను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.

 If You Follow This Tip, Hair Will Not Fall While Taking A Shower! Hair Fall, Sto-TeluguStop.com

అయినా సరే సమస్య అదుపులోకి రాకుంటే ఏం చేయాలో తెలీక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే తలస్నానం చేసే సమయంలో జుట్టు రాలనే రాలదు.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్‌ వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉద‌యాన్నే నానబెట్టుకున్న బియ్యం, మెంతుల నుంచి వాటర్ ను స్ట్రైప‌ర్‌ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపు వేసి మిక్స్ చేయాలి.

ఆ త‌ర్వాత‌ ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.అయితే హెయిర్ వాష్ చేయడానికి గంట ముందు గోరు వెచ్చని నూనె తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Remedy-Telugu Health Tips

ఆపై హెయిర్ వాష్ కనుక చేసుకుంటే జుట్టు అస్సలు రాలదు.పైగా ఈ చిట్కాను వారంలో రెండు సార్లు కనుక పాటిస్తే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.మరియు జుట్టు షైనీ గా సైతం మెరుస్తుంది.కాబట్టి తల స్నానం చేసినప్పుడు జుట్టు విపరీతంగా రాలుతుందని బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube