అధిక రక్తపోటు దూరమవ్వాలంటే ఈ పండు తినక తప్పదు..?

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు హై బీపీ సమస్య( Blood pressure )తో బాధపడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరూ కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

 This Fruit Must Be Eaten To Get Rid Of High Blood Pressure, Blood Pressure, Ba-TeluguStop.com

ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే కొన్ని రకాల పండ్లను క్రమం తప్పకుండా తింటూ ఉండాలి.అందులో ముఖ్యమైనది అరటి పండు.

అలాగే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ అరటి పండ్లలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.వీటిలో 1000 రకాల అరటి పండ్లు ఉన్నాయని చాలా మందికి తెలియదు.

ఇందులో పసుపు పచ్చ అరటి పండ్లు, చక్కర కేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కర కేళి ( Wheel fun )ఇలా కొన్ని రకాల అరటి పండ్లు( Banana ) మాత్రమే చాలా మందికి తెలుసు.

ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో ఎర్రటి పండ్లు కూడా ఉన్నాయి.అయితే ఇవి మనకు చాలా అరుదుగా దొరుకుతాయి.ఈ ఎర్రటి అరటి పండ్ల( Red bananas ) వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఎర్రటి అరటి పండ్లలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ b6 లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.ఈ పండులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల హై బీపీతో బాధపడేవారు, ఈ పండు ను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.దీని వల్ల మీ బీపీ కంట్రోల్ అవుతుంది.అలాగే బరువు ఎక్కువగా ఉన్న వారు కూడా ఈ పండు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.ఎందుకంటే వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి.ఇవి మీ బరువు త్వరగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube