గాయత్రి రఘురాం ఈ పేరు మీకు ఎవరికైనా గుర్తుందా.? “బాపు బొమ్మకు పెళ్ళంట” అనే సినిమా ద్వారా మన తెలుగు తెరకు పరిచయమైంది గాయత్రి.ఈమె తమిళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.తండ్రి రఘురాం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి డాన్స్ కొరియోగ్రాఫర్.అలాగే తల్లి గిరిజా రఘురామ్ కూడా బాగా పేరు పొందిన కొరియోగ్రాఫర్.అలాగే తన చెల్లి సుజనా కూడా మంచి డాన్సర్.
గాయత్రీ వాళ్ళ తాత కృష్ణ స్వామి సుబ్రమణ్యం కూడా తమిళంలో ఒక పెద్ద పేరుగాంచిన దర్శకుడు.ఇలా అందరూ సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కావడంతో గాయత్రికి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి పెద్ద సమయం పట్టలేదు.
2002 సంవత్సరంలో చార్లీచాప్లిన్ అనే చిత్రంతో తమిళ చిత్ర రంగంలో ప్రవేశం చేసింది.అలాగే తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాలలో నటించినది.
అంతేకాకుండా గాయత్రి రఘురాం స్వయంగా ఒక సినిమాను కూడా డైరెక్ట్ గా చేసింది.తమిళంలో వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది గాయత్రి.
అలాగే 2015 లో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం నియామకంలో సెక్రటరీ ఫర్ ఆర్ట్స్ గా జాయిన్ అయింది.గాయత్రి 2006లో చెన్నైకి చెందిన, అమెరికాలో ఉండే దీపక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.
తమిళ రంగం నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది గాయత్రి పెళ్లి.
అయితే ఈ పెళ్లి కోసం గాయత్రి రఘురాం తల్లిదండ్రులు పెళ్లి కొడుకుకి కట్నం కింద మూడు లక్షల 50 వేల విలువైన బంగారు ఆభరణాలను, వెండి ఆభరణాలను, డైమండ్స్ ను కట్నంగా ఇచ్చారు.పెళ్ళికొడుకు తరపు బంధువులకు విలువైన పట్టు చీరలు పంచెలు కూడా పెట్టారు.ఇంకా పెళ్లి కి సంబంధించిన ఎన్నో విషయాలలో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు.
పెళ్లి అయిన ఒక వారం రోజుల తర్వాత భర్తతో కలిసి గాయత్రి రఘురాం అమెరికాకు వెళ్లారు.ఆమెకు సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలను అత్తవారింట్లోనే వదిలి పెట్టి గాయత్రి రఘురాం అమెరికాకు వెళ్లి పోయింది.
పెళ్ళయిన కొన్ని రోజుల పాటు గాయత్రి రఘురాం, తన భర్త అయిన దీపక్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
అయితే ఒకరోజు గాయత్రి అత్తగారు, మామగారు అయిన సావిత్రి, చంద్రశేఖర్ కొడుకు కాపురాన్ని చూడటానికి అమెరికాలోని కొడుకు ఇంటిలో అడుగుపెట్టారు.ఎప్పుడైతే గాయత్రి ఆ ఇంట్లో అడుగు పెట్టారో అప్పుడే గాయత్రి జీవితం అల్లకల్లోలం లాగా మారిపోయింది.చెన్నైలో గాయత్రి వాళ్ళ కుటుంభంను చాలా దగ్గరగా చుసిన వాళ్ళ అత్తగారు గాయత్రి పుట్టింటి ఆస్థి మీద కన్నువేసింది.
ఆమె కూతురు అల్లుడు యూఎస్ లో స్థిరపడాలని అనుకుంటున్నారు అని వాళ్ళ ఖర్చుల నిమిత్తం 15 కోట్లు డబ్బులు కావాలని గాయత్రి వాళ్ల పుట్టింటి వాళ్ళని డిమాండ్ చేసింది గాయత్రి అత్తగారు.అయితే గాయత్రి భర్త దీపక్ కూడా తల్లికి వంత పాడాడు.
డబ్బులు కోసం ప్రతిరోజు దీపక్, వాళ్ళ అమ్మ గాయత్రిని టార్చర్ పెడుతూ వచ్చారు.భర్త అత్త పెట్టే బాధలు తట్టుకోలేక గాయత్రి రఘురాం అమెరికాలో ఉంటున్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
అక్కడ నుంచి తన భర్త అయిన దీపక్ కు ఫోన్ చేస్తే.నువ్వు వెంటనే డబ్బులు తీసుకురాకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.గాయత్రి చేసేదిలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.ఇదంతా విన్న గాయత్రి తల్లి వాళ్ళ అత్తగారు అయిన సావిత్రిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చాలానే చేసింది.
గాయత్రి తల్లిని కూడా వాళ్ళ అత్తగారు నాన మాటలు గాని పెద్ద గొడవ కూడా చేసిందట.గాయత్రి రఘురాం తల్లిదండ్రులు వాళ్ళ మీద కేసు దాఖలు చేశారు.
ఈలోపు గాయత్రి భర్త అయిన దీపక్ విడాకుల నోటీసు పంపించాడు.ఈ విడాకుల నోటీసు చూసిన గాయత్రీ తల్లిదండ్రులు ఆ తరుణంలో తన కూతుర్ని మళ్ళీ అత్తవారింట్లో పంపించడానికి ఇష్ట పడకుండా విడాకులు ఇవ్వడం సమంజసం అనే నిర్ణయానికి వచ్చారు.దాంతో పాటు గాయత్రి తన భర్త మీద అలాగే గాయత్రీ అత్తగారు మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టారు.2010లో చెన్నై కోర్టు గాయత్రి, దీపక్ లకు విడాకులు మంజూరు చేసింది.అలాంటి గాయత్రి జీవితంలో అత్తగారు అయిన సావిత్రి ప్రవేశించి విలన్ లా మారింది.ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదే కాబోలు.!!
.