అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలను కేంద్రంగా చేసుకుని కొందరు పంజాబీ గ్యాంగ్‌స్టర్లు చెలరేగిపోతున్నారు.హత్యలు, దోపిడీలు, స్మగ్లింగ్ తదితర నేరాలకు పాల్పడుతూ తమ నేర సామ్రాజ్యాలను అంతకంతకూ విస్తరిస్తున్నారు.
తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో పంజాబ్‌కు చెందిన సునీల్ యాదవ్ ( Sunil Yadav )అలియాస్ గోలియా అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు ప్రత్యర్ధులు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు గోల్డీ బ్రార్ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్న రాజస్థాన్‌కు చెందిన రోహిత్ గోదారా( Rohit Godara ) ఈ హత్య తమ పనే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
మృతుడి స్వస్థలం పంజాబ్ రాష్ట్రం అబోహర్ ఏరియాలోని వార్యం ఖేరా గ్రామం.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం .రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో( Jodhpur, Rajasthan ) 1 క్వింటాల్ 20 కిలోల హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో యాదవ్ పరారీలో ఉన్నాడు.నకిలీ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌కి పారిపోయిన అతను అమెరికాలో తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
యాదవ్ తండ్రి పవన్ కుమార్ భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి.అయితే సునీల్ చాలా ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
ఎన్ఐఏ , ఇంటెలిజెన్స్ ( NIA, Intelligence )వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు యాదవ్ ఇంటిపై పలుమార్లు దాడి చేశాయి.అతను పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తేలింది.ఇక గోదారా పెట్టిన పోస్ట్‌లో.సునీల్ నా సోదరుడు అంకిత్ భాదూను పంజాబ్ పోలీసుల సాయంతో ఎన్‌కౌంటర్‌లో చంపాడని , అందుకు ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పాడు.పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల యువతను అతను డ్రగ్స్ బారినపడేలా చేశాడని .పోలీసుల సాయంతో డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారని ఆరోపించాడు.వీరంతా కలిసి గుజరాత్‌లో 300 కిలోల డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాల్గొన్నారని గోదూర చెప్పాడు.అంకిత్ భాదూ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది ప్రమేయం ఉందని.భయంతో అమెరికాకు పారిపోయిన నా సోదరుడిపై సునీల్ నిఘా పెట్టాడని తెలిపాడు.