అమెరికా వెళ్లాలని అక్కడి స్థిరపడి డాలర్స్ సంపాదించాలనే కల భారతీయుల్లో నానాటికీ పెరుగుతోంది.చట్టప్రకారం అగ్రరాజ్యంలో అడుగుపెట్టడం కుదరని పక్షంలో దొడ్డిదారిలో వెళ్లేందుకు మన పిల్లలు వెనుకాడటం లేదు.
ఇలాంటి సాహసాలు అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు( border security , immigration officials ) చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.ఈ ప్రయత్నంలో ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.
అయితే చట్టపరంగా వెళ్లే వారి కంటే దొడ్డిదారిన వెళ్లే వారు పెరిగిపోతున్నారు.ఈ క్రమంలో మానవ అక్రమ రవాణా ముఠాలకి చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అంతేకాదు.ఇలాంటి వారి నుంచి భారీగా వసూలు చేస్తూ వారి జేబు గుల్ల చేస్తున్నాయి ఆయా ముఠాలు.
రెండేళ్ల క్రితం గుజరాత్‌కు( Gujarat ) చెందిన ఓ నలుగురు సభ్యుల కుటుంబం కెనడా సరిహద్దుల నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తూ గడ్డకట్టే చలిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి భవేష్ పటేల్ ( Bhavesh Patel )అనే వ్యక్తి సహా మరికొందరిపై కెనడా పోలీసులు అభియోగాలు మోపారు.
ఇదిలాఉండగా.కొన్ని సంస్థలు , ముఠాలు భారతీయులను క్షేమంగా విదేశాలకు చేరుస్తామని చెప్పి మానవ అక్రమ రవాణా ముఠాలకు అప్పగించినట్లుగా దర్యాప్తులో తేలింది.ప్రధానంగా కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వీరిని తరలిస్తున్నారని ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.55 నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.కెనడా, అమెరికాలలోని టాప్ క్లాస్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించాలని .అలా చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుందని కొన్ని ముఠాలు భారతీయులకు మాయమాటలు చెబుతున్నాయని దర్యాప్తులో తేలింది.
స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి యూనివర్సిటీలలో చేరడం లేదని.దీంతో కెనడా బయల్దేరే ముందు తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి.ఇలాంటి వారు నిబంధనలకు విరుద్ధంగా యూఎస్ – కెనడా సరిహద్దును దాటుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనల్లో మనీలాండరింగ్ కోణం ఉండటంతో ఈ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు అంశాలపై ఆరా తీస్తోంది.