కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!

కౌశిక్ తల్లి ( Kaushik’s mother )కొన్నిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఆమె వైపు నుంచి ఎన్టీఆర్ కు సరైన సమాచారం లేకుండా ఆరోపణలు చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.

 Junior Ntr Fans Comments About Koushik Mother Details Inside Goes Viral In Socia-TeluguStop.com

ఆమె చెప్పిన విధంగా హాస్పిటల్ బిల్ బ్యాలెన్స్ 20 లక్షల రూపాయలు లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.కౌశిక్ 90 శాతం రికవరీ అయ్యడని డాక్టర్లు చెప్పారని వాళ్లు చెప్పుకొచ్చారు.

టీటీడీ 40 లక్షలు( TTD 40 lakhs ), ఏపీ సర్కార్ 11 లక్షలు ఇచ్చిందని అభిమానులు ఇచ్చిన ఇతర డబ్బులలో కొంత మొత్తాన్ని ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంచలన ఆరోపణలు చేశారు.20వ తేదీకి 9 లక్షలు చెల్లించి ఉంటే డిశ్చార్జ్ జరిగేదని ఆమె నిర్లక్ష్యం వల్ల బిల్లు మరో 8 లక్షల రూపాయలు పెరిగిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్లడించడం గమనార్హం.

Telugu Ntr, Ntrfans, Kaushiks Mother, Tollywood, Ttd Lakhs-Movie

ఆమె చేసిన ఆరోపణలకు వాస్తవాలకు పొంతన లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ( NTR fans )అన్నారు.7 లక్షల రూపాయలు అనవసరంగా పోయిందని ఫ్యాన్స్ పేర్కొన్నారు.60 లక్షలకు బిల్లు సెటిల్ కాగా 51 లక్షలు వేర్వేరు రూపాల్లో అందిందని వాళ్లు చెప్పుకొచ్చారు.రాబోయే మూడు నెలలు 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుందని ఆ డబ్బుల కోసం ఆమె ఈ విధంగా చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు.

Telugu Ntr, Ntrfans, Kaushiks Mother, Tollywood, Ttd Lakhs-Movie

ఎన్టీఆర్ ధైర్యం చెప్పారే తప్ప సహాయం గురించి కచ్చితమైన హామీ వీడియోలో అప్పుడు ఇవ్వలేదని కానీ అభిమాని కోసం సాయం చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్లడించారు.నిన్న 5 గంటలకు మొత్తం బిల్లు చెల్లించామని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.రాబోయే మూడు నెలలు మేము మా వంతు సహాయం చేస్తామని కౌశిక్ తల్లికి హామీ ఇచ్చామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube