Pizza Side Effects: తరచూ పిజ్జా తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి!

పిజ్జా( Pizza ).ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఒకటి.

 Dangerous Side Effects Of Eating Pizza Frequently-TeluguStop.com

పిజ్జా జంక్ ఫుడ్ అని తెలిసినప్పటికీ పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు.కోట్లాది మందికి పిజ్జా ఒక ఫేవ‌రెట్ ఫుడ్‌గా మారింది.

నిత్యం పిజ్జా తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు.మీరు కూడా తరచూ పిజ్జా తింటారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.

Telugu Tips, Junk, Latest, Effects-Telugu Health

తినడానికి పిజ్జా ఎంతో రుచికరంగా ఉంటుంది.కానీ ఆరోగ్యానికి మాత్రం ఏ మాత్రం మంచిది కాదు.వారానికి ఒక్కసారి పిజ్జాను తిన్నా కూడా మీ శరీరం వ్యాధుల పుట్టే అవుతుంది.

పిజ్జాలో వాడే చీజ్ మరియు ప్రాసెస్ చేసిన మీట్ లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి.ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను భారీగా పెంచుతాయి.కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బుల ( Heart disease )ప్రమాదం కూడా పెరుగుతుంది.అలాగే రెండు లేదా మూడు పిజ్జా ముక్కలను తినడం వల్ల మీకు ఏకంగా 800 నుండి 1,200 కేలరీలు చేరుతాయి.

కాబ‌ట్టి తరచూ మీరు పిజ్జాను కనుక తింటే కొద్ది రోజుల్లోనే భారీగా బ‌రువు పెరుగుతారు.ఊబకాయం బారిన పడతారు.

ఓవ‌ర్ గా పిజ్జాను తినడం వల్ల త‌లెత్తే స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌కం( Constipation ) ఒక‌టి.పిజ్జా లో వాడే మైదా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు.

దీని కారణంగా జీర్ణ వ్యవస్థ( Digestive system ) నెమ్మదిస్తుంది.మలబద్ధకానికి దారి తీస్తుంది.

Telugu Tips, Junk, Latest, Effects-Telugu Health

పెప్పరోని, బేకన్ మరియు సాసేజ్ వంటి అధిక కొవ్వు ప్రాసెస్ చేసిన మాంసాలను పిజ్జా త‌యారీలో వాడ‌తారు.ఇవి తీసుకోవడం వల్ల ప్రేగు మరియు కడుపు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే రిస్క్‌ పెరుగుతుంది.ఇక‌ పిజ్జాను ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు.కానీ తరచూ అదే పనిగా పెట్టుకుని పిజ్జా ను తీసుకుంటే అనేక జబ్బులను మీరే మీ చేతులతో ఆహ్వానించినట్లు అవుతుంది జాగ్రత్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube