పొడవాటి జుట్టును పొందాలనుకుంటున్నారా? అయితే ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయండి!

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు పొడవాటి జుట్టు ని పొందాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.జుట్టును పొడుగ్గా పెంచుకోవడం కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూలను వాడుతుంటారు.

 Want To Get Long Hair Then Try This Pack! Long Hair, Hair Pack, Latest News, Hai-TeluguStop.com

కానీ వాటితోనే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది అనుకుంటే పొరపాటే.పొడవాటి జుట్టును పొందాలంటే మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్స్‌, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.అలాగే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ పొడవాటి జుట్టును అందించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ఈ ప్యాక్ ను ట్రై చేస్తే పొడవాటి జుట్టును పొందాలనే మీ కోరిక నెరవేరుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు భృంగరాజ్ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ నాలుగు నుంచి ఐదో టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Long, Split Ends, Thick-Telugu Healt

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట‌ లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా పెరుగుతుంది.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Long, Split Ends, Thick-Telugu Healt

జుట్టు చివర్లు చిట్లడం వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంటుంది.అయితే ఈ సమస్యను నివారించడానికి పైన చెప్పిన హెయిర్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది.పైగా ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయడం వల్ల తెల్ల జుట్టును సైతం త్వరగా రాకుండా అడ్డుకోవ‌చ్చు.

కాబట్టి పొడవాటి జుట్టును పొందాలని ఆశ పడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube