ఆలుగడ్డలను అతిగా తింటున్నారా.. అయితే డేంజర్ లో పడినట్లే!

ఆలుగడ్డలు.( Potato ) వీటిని బంగాళదుంపలు అని కూడా అంటారు.

 Dangerous Side Effects Of Potato! Potato, Potato Side Effects, Latest News, He-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఆలుగడ్డలు ముందు వరుసలో ఉంటాయి అన‌డంలో సందేమం లేదు.పైగా ఆలుగడ్డ చాలా మందికి ఫేవరెట్ అని కూడా చెప్పుకోవాలి.

ఆలుగడ్డలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అయితే ఆలుగడ్డ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తీసుకుంటే మాత్రం డేంజర్ లో పడినట్లే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Telugu Eat Potato, Tips, Latest, Potato, Potato Benefits, Potato Effects-Telugu

ఆలుగడ్డ పై ఉన్న ఇష్టంతో కొందరు వారంలో మూడు నాలుగు సార్లు అయినా దాన్ని తీసుకుంటూ ఉంటారు.ఇంకొందరు అయితే రెగ్యులర్ గా కూడా ఆలుగడ్డను తింటారు.ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ అధిక మొత్తంలో ఉంటాయి.అందు వల్ల బరువు తగ్గాలనుకునే వారు ఆలుగడ్డను అతిగా‌ తింటే బాడీలో మరింత కొవ్వు పెరుగుతుంది.దీంతో వెయిట్ లాస్ కాదు వెయిట్ గెయిన్( Weight gain ) అవుతారు.అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఆలుగడ్డను చాలా తక్కువగా తీసుకోవాలి.

Telugu Eat Potato, Tips, Latest, Potato, Potato Benefits, Potato Effects-Telugu

అలాగే ఆలుగడ్డలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.అందువల్ల ఆలుగడ్డను ఓవర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి.మధుమేహం బాధితులకు ఇది చాలా రిస్క్ అవుతుంది.ఆలుగడ్డలను అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్,( Gas ) ఎసిడిటీ, డయేరియా, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

కాబట్టి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఆలుగడ్డలో అధిక మాత్రం తీసుకోకండిఇక కొందరు ఆలుగడ్డ తో చిప్స్ తయారు చేసుకుని తింటుంటారు.కానీ ఆలుగడ్డ చిప్స్ అస్సలు తీసుకోకూడదు.

ఇవి మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.కొలెస్ట్రాల్( Cholesterol ) ను పెంచి గుండెకు ముప్పును రెట్టింపు చేస్తాయి.

అందుకే ఆలుగడ్డను బాయిల్, బేక్, స్టీమ్ వంటివి చేసి తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube