మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కెరీర్ పరంగా వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండగా 2025 సంవత్సరంలో చిరంజీవి విశ్వంభర సినిమాతో( Vishwambhara Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ఏడాది చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును( Padma Vibhushan Award ) అందుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి చిరంజీవికి గౌరవ డాక్టరేట్ కూడా దక్కింది.తాజాగా చిరంజీవి తన డ్యాన్స్ స్టెప్స్ ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో కూడా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఐఫా అవార్డును( IIFA Award ) సొంతం చేసుకోవడంతో చిరంజీవి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరడం కొసమెరుపు.
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డ్ చిరంజీవికి దక్కడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది.చిరంజీవి ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటూ ఉండటంతో సీనియర్ హీరోలలో మెగాస్టార్ ఒకింత టాప్ లో ఉన్నారు.చిరంజీవికి ఇతర భాషల్లో సైతం క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఆచార్య, భోళా శంకర్ నిరాశ పరిచినా చిరంజీవి భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.విశ్వంభర సినిమా కోసం యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు.చిరు కెరీర్ లో ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలేవీ లేవనే సంగతి తెలిసిందే.