సాధారణంగా పాములు( Snakes ) అంటే చాలా మందికి భయం.పాములు ఒక్కోసారి ఊహించని ప్రదేశాలలో కనిపించి ప్రజల అందరిని భయభ్రాంతులకు గురిచేస్తాయి.
ఒక్కోసారి ఇలాంటి సందర్భాలలో చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్న వివరాలు చాలానే ఉన్నాయి.మనం సాధారణంగా బైకులు, కార్లు, బస్సులు, పాతకాలపు భవనాలు లాంటి ప్రాంతాలలో మనం పాములను ఎక్కువగా చూస్తూ ఉంటాం.
తాజాగా ఒక 12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రా కార్ బ్యానెట్ లో ఉండడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చక్కరలు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ప్రదేశంలో పార్కు చేసి ఉన్న కారు నుంచి వింత శబ్దాలు రావడంతో యజమానికి అనుమానం వచ్చింది.మొదట ఎలాంటి సందేహం లేకున్నా పదేపదే శబ్దాలు రావడంతో అందులో ఏముందో చూడాలని ఉద్దేశంతో బానైట్‌ను ఓపెన్ చేశాడు.
దాంతో క్యాబిన్ లోపల తెరిచి చూడడంతో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా పడుకొని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.దీంతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడకు చేరుకొని కార్ బ్యానెట్ ను ఓపెన్ చేసి ఎంతో చాకచక్యంగా పాములు పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.ఆ పాము బుసలు కొడుతున్నా కూడా భయపడకుండా ఎంతో చాకచక్యంగా పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు.మనం ఎక్కువగా బైకులలో ఇంజన్ లో ఇరుక్కున్న పాముల సందర్భాలు చూశాం కానీ.
కారు పెద్దపెద్ద పాములును బయటకు తీసిన సందర్భాలు చాలా అరుదు.చివరకు విమానాల్లో కూడా పాములు కనిపించి ప్యాసింజర్స్ లో ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తూ “వామ్మో అంత పెద్ద ఇంజన్లోకి ఆ పాము ఎలా వెళ్ళిందో” అంటూ కామెంట్ చేస్తున్నారు.అంత పెద్ద పామును ఎంతో చాకచక్యంగా చాలా సులువుగా పట్టుకోవడం విశేషం అంటూ కామెంట్ మరికొందరు చేస్తున్నారు.