నేటి యాంత్రిక యుగంలో పెద్దలే కాదు.పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు.
ఆ ఒత్తిడే పిల్లల బంగారు భవిష్యత్తును చిత్తు చేస్తుంది.ఇక పిల్లల్లో మానసిక ఎదుగుదల తక్కువగా ఉండటం వల్ల.
ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలో తెలియక సతమతమవుతంటారు.అందుకే పిల్లల్లో ఒత్తిడిని తల్లిదండ్రులే దూరం చేయాల్సి ఉంటుంది.
మరి అందు కోసం ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ చదువుకోవాలి అంటూ పోరు పెడతారు.
దాంతో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.అందుకే ఎప్పుడూ చదువే కాకుండా.
రోజులో కొంత సేపైనా డ్యాన్సింగ్, సింగింగ్, బొమ్మలు గీయడం, పేయింటింగ్, మ్యూజిక్ ప్లే చేయడం ఇలా పిల్లలకు ఇష్టమైన హాబీలను చేయనివ్వాలి.దాంతో వారు ఒత్తిడి ఫీల్ అవ్వకుండా ఉంటారు.
అలాగే పిల్లల్లో ఒత్తిడి దూరమవ్వాలంటే.ప్రతి రోజు వారిచే ఆటలు ఆడించాలి.ఆడలు ఆడటం వల్ల శరీరం అలసిపోతుంది.ఆ అలసటే ఒత్తిడిని తరిమి కొడుతుంది.
అయితే ప్రస్తుతం కరోనా సమయం కాబట్టి.ఇంట్లో పిల్లలను ఆడించాలి.
చాలా మంది పెరేంట్స్ పిల్లలను పట్టించుకోకుండా.ఫోన్లు, టీవీలు ఇలాంటి గడ్జెట్స్‌తో గడుపుతారు.దాంతో పిల్లలు ఒంటరితనాన్ని ఫీలవుతూ ఒత్తిడికి గురవుతారు.అందుకే తల్లిదండ్రులు ప్రతి రోజు పిల్లల కోసమూ కొంత సమయం కేటాయించాలి.
ఆ సమయంలో వారితో సరదగా మాట్లాడటం, వారికి కథలు చెప్పడం, ఏది మంచి.ఏది చెడు వంటి జాగ్రత్తలు చెప్పడం చేస్తే.
పిల్లల్లో ఒత్తిడి పరార్ అవుతుంది.
![Telugu Tips, Latest, Reduce Stress, Stress-Telugu Health - తెలుగు Telugu Tips, Latest, Reduce Stress, Stress-Telugu Health - తెలుగు](https://telugustop.com/wp-content/uploads/2021/05/reduce-stress-children-stress-stress-in-children.jpg )
ఇక ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి.పిల్లలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలి.ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా.
ఏ వేళకు ఏది పెట్టాలో అదే పెట్టండి.కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ వంటివి పిల్లల డైట్‌లో లేకుండా చూడండి.
పిల్లల చేత ప్రతి రోజు కొంత సమయం పాటు వ్యాయామం చేయించాలి.తద్వారా పిల్లల్లో ఒత్తిడి దూరం అవుతుంది.