ఫ్యాన్స్ మీసం మెలేసేలా ఉన్న చరణ్ పెద్ది ఫస్ట్ లుక్.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Star Ram Charan )గురించి మందరికి తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

 Peddi First Look Ram Charan Oozes Raw Intensity, Peddi Movie, First Look, Ram Ch-TeluguStop.com

ఇటీవల గేమ్ చేంజ్ యువర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన చెర్రీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవడంతో తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.అయితే ఇప్పుడు చెర్రీ తన ఆశలన్నీ కూడా బుచ్చిబాబు సినిమా పైనే పెట్టుకున్నాడు.

డైరెక్టర్ బుచ్చిబాబు( Director Buchibabu ) కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను రూపొందిస్తున్నారు.నిజానికి ఇవాళ టీజర్ ప్లాన్ చేశారు.

కానీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజు దాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Peddiram, Peddi, Ram Charan, Tollywood-Movie

ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ( AR Rahman )బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.కానీ ఫ్యాన్స్ కి టైటిల్ రివీల్ పోస్టర్ రూపంలో మంచి కానుక అందించింది ఆర్సీ 16 బృందం.అయితే ముందు నుంచి వార్తలు వినిపించినట్టుగానే ఈ సినిమా టైటిల్ ను పెద్ది( Peddi ) అనే పేరుతో లాక్ చేశారు.

నిఖార్సైన మాస్ లుక్ తో చేతిలో చుట్ట కాలుస్తూ రౌద్రం నిండిన కళ్ళతో రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలంని మించి ఇది ఉంటుందనే ఇన్ సైడ్ టాక్. రెండో స్టిల్ లో జీన్స్ ప్యాంటు లో రఫ్ లుక్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.

నిజానికి ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా ఇలాంటిదే.కానీ గేమ్ ఛేంజర్ లో ఐఎఎస్ ఆఫీసర్ గా మరీ ఓవర్ సాఫ్ట్ అయిపోవడం వాళ్లకు కనెక్ట్ కాలేదు.

Telugu Peddiram, Peddi, Ram Charan, Tollywood-Movie

అందులోనూ బ్యాడ్ కంటెంట్ మరింత దెబ్బ కొట్టింది.కానీ పెద్ది విషయంలో అలాంటి అనుమానాలు అక్కర్లేదు.బుచ్చి గురువు సుకుమార్ ని దాటేశాడు.అయితే విడుదల తేదీని ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.టీజర్ లో ఉంటుందని సమాచారం.2026 మార్చి 26 ఉంటుందని వచ్చిన టాక్ ఎంతవరకు నిజమనేది తెలిసేది అప్పుడే.నాని ది ప్యారడైజ్ ఉన్నప్పటికీ ఇది మంచి డేట్ అనే ఉద్దేశంతో మైత్రి మేకర్స్ దీని వైపే మొగ్గు చూపినట్టు టాక్.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్దిలో శివరాజ్ కుమార్ పాత్ర కీలకం కానుంది.

ఆయనకు సంబంధించిన ఎపిసోడ్స్ ని వేగంగా తీస్తున్నారు.ఇకపోతే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ ని విడుదల చేయగా అధిక కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ అభిమానులు మీసాలు మెలేసేలా ఉంది చెర్రీ లుక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube