ప్రస్తుత సమాజంలో దేవుడిపై భక్తి అంటే మనుషులకే కాదు జంతువులకు ఉంది అని ఇప్పటికే చాలా జంతువులు నిరూపించాయి.అక్కడ ఉన్న భక్తులతోపాటు ఒక మేక కూడా ఎంతో శ్రద్ధగా తన భక్తిని దేవునికి తెలిపింది.
ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది.హారతి జరుగుతున్నంత సేపు తల వంచి ప్రార్థన చేస్తున్నట్లుగా అలాగే చాలాసేపు ఉండిపోయింది.
ఇది చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు.
కాన్పూర్ లోని ఒక దేవాలయంలో దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో ఒక మేక వింతగా ప్రవర్తించింది.
భక్తుల మాదిరిగా ముందరి కాళ్లతో మోకరిల్లింది.తల వంచుకుని దేవుడ్ని వేడుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గంగా నది తీరంలోని పురాతన శివాలయంలోని శివుడ్ని బాబా ఆనందేశ్వర్‌గా భక్తులు పూజిస్తూ ఉంటారు.
అయితే ఇటీవల ఈ ఆలయం వద్ద ఒక వింత సంఘటన జరిగింది.ఆలయంలోని పూజారులు సాయంత్రం వేళ దేవుడికి హారతి ఇచ్చి మంత్రాలు చదువుతున్నప్పుడు అక్కడి భక్తులు భక్తి భావంతో మోకరిల్లి దేవుడ్ని వేడుకుంటున్నారు.అయితే, అక్కడ ఉన్న భక్తులతోపాటు ఒక మేక కూడా ఎంతో శ్రద్ధగా తన భక్తిని చాటి, ముందు కాళ్లతో ఆలయం మెట్ల వద్ద మోకరిల్లింది.
హారతి జరుగుతున్నంత సేపు తల వంచి ప్రార్థన చేస్తున్నట్లు ఎంతో శ్రద్ధగా ఉంది.ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.డేవిడ్ జాన్సన్ అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశాడు.‘కాన్పూర్‌లోని పరమాత్మ ఆలయం నుంచి వెలువడిన ఒక అద్భుతమైన భక్తి భావ వీడియో ఇది.బాబా ఆనందేశ్వరుడికి హారతి ఇస్తున్న సమయంలో ఒక మేక భక్తితో మోకరిల్లినట్లు కనిపించింది’ అని క్యాప్షన్ జత చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.