చాలామంది ప్రజల ప్రజలు జాతకాలు చెప్పించుకోవడానికి తమ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటారు.ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది ఎలాంటి మార్పులు తమ జీవితంలో వస్తున్నాయో అని తెలుసుకుంటూ ఉంటారు.
ఈ గ్రహం ఎలా ఉన్నా ఆ శని ప్రభావం జాతకంలో ఎక్కువగా ఉందంటే చాలు భయపడిపోతూ ఉంటారు.నిజానికి శని దేవుడు న్యాయానికి అధిపతి.
న్యాయధిపతి శని దేవుడు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు త్వరలోనే ధనవంతులుగా మారిపోతారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.అదే సమయంలో ప్రతికూలంగా ఉంటే కష్టాలు తప్పవని కూడా చెబుతున్నారు.
ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో శని దోషాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం( Astrology ) చెబుతోంది.
శని దేవుడు సానుకూలంగా ఉండాలన్న ఆయన అనుగ్రహం కావాలనుకోవాలన్నా శని దేవుని దేవాలయానికి వెళ్లి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పిస్తే ప్రయోజనం ఉంటుందని కూడా చెబుతున్నారు.మరి అంత శక్తివంతమైన శని దేవుని ఆలయాలు ఎక్కడ ఉన్నాయి.మన దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శని ధామ్ దేవాలయం( Shani Dham Temple ) ఢిల్లీలోని ఛతర్ పుర్లో ఎంతో ప్రసిద్ధమైన శని దేవాలయం ఉంది.ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు శని దేవుని అనుగ్రహం కోసం వస్తూ ఉంటారు.
ఈ దేవాలయంలో వెలిసిన శని దేవుని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలోని కృష్ణానగర్ లో కోకిలవ ధామ్ దేవాలయం ఆలయం ఉంది.
ఈ శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి నైవేద్యంగా ఏడు శనివారాలు ఆవాల నూనె సమర్పిస్తే ఎలాంటి శని దోషాలు అయినా తొలగిపోతాయని భక్తుడు నమ్ముతారు.
అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో తిరునల్లార్ శని దేవాలయం ఉంది.ఎవరి జాతకంలో అయినా శని స్థానం మార్పు చెందినప్పుడు ఇక్కడ ప్రతిజ్ఞ పూజలు చేయిస్తారు.అలా చేయించడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలో ఒక శని దేవాలయం ఉంది.ఈ ఆలయంలో శని దేవుడు కాకి పై కూర్చొని భక్తులకు( Devotees ) దర్శనం ఇస్తాడు.
శని దోషం ఉన్నవారు ఈ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే ఆ దోషం తొలగిపోతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
DEVOTIONAL