ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలి వెళ్తున్నారు.ఈ అయ్యప్ప స్వాముల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు పెరుగుతూనే వస్తుంది.
మాల ధరించే వాళ్లలో దాదాపు యువకులే అధికంగా ఉంటున్నారు.మణికంఠుని దీక్షలో భాగంగా నల్లటి తెస్తులు ధరించి 40 రోజులపాటు స్వాములు కటిక నేలమీద నిద్రిస్తూ ఉంటారు.
చల్లటి నీటితో మాత్రమే స్వాములు స్నానం చేయాలి.అలాగే దీక్ష అయిపోయేంతవరకు ఎలాంటి పాదరక్షకాలు ధరించకూడదు.
అయితే ఇలా అయ్యప్ప మల ఎందుకు వేసుకుంటారు.అయ్యప్ప మాల ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు.అని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యప్ప దీక్షలో నేలపై నిద్రపోవడం వల్ల వెన్ను సమస్యలు తగ్గిపోతాయి.అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగవుతుంది.తెల్లవారుజామున లేచి చల్లటి నీటితో స్నానం చేయడంవల్ల నాడి వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది.ప్రతిరోజు దుస్తులు తడిపి శుభం చేసుకోవడం అలవాటుగా మారిపోతుంది.
దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది.అయ్యప్ప స్వామి దీక్షలు ఉండే వాళ్లంతా నల్లటి దుస్తులు ధరిస్తారు.
దీనికి గల కారణం ఏంటి అంటే శని దేవుడికి నల్లటి రంగు అంటే ఇష్టం.కాబట్టి ఆ రంగు బట్టలు ధరించి పూజలో పాల్గొన్న వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా చలి కాలంలో నల్లని దుస్తులు ధరించడానికి కారణం ఏమిటంటే శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఈ నలుపు రంగు దుస్తులు ఇస్తాయి.

అయ్యప్ప మాలలు ధరించిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారంటే నేను అనే భావన వారిలో తొలగిపోతుంది కాబట్టి.అయ్యప్ప మాల వేసిన భక్తుడు శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించేది దుస్తులు ఆచార వ్యవహారాలు దినచర్య పూర్తిగా మారిపోతాయి.అందుకే ఈ మాల ధరించిన భక్తుడు జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడని భావనతో ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తూ ఉంటారు.