తుని వైసీపీ ఫ్లీనరీలో మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరు సంపాదించుకున్నారని అన్నారు.
అలాంటి భావనే మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఉండేదని పేర్కొన్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన పరిపాలన అందించడంతో అది కుదరలేదని వ్యాఖ్యానించారు.
దీంతో కార్యకర్తలు, నాయకులు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారని అది వాస్తవమని మంత్రి అన్నారు.నేను కూడా మీలానే నిరుత్సాహానికి గురి అయ్యానంటూ కార్యకర్తలకి చెప్పుకొచ్చారు.
టీడీపీ హయాంలో ఏ పధకం అమలు కావాలన్నా జన్మభూమి కమిటీ మెంబెరే అమలు చేసేవారని గుర్తు చేసారు.అందుకే వారు బాత్రూముల పధకంతో పాటు మిగిలిన పథకాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని అన్నారు.







