వర్షాకాలంలో కాలీఫ్లవర్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

కాలీఫ్లవర్( Cauliflower) పోషకాల ఖజానా అని దాదాపు చాలా మందికి తెలియదు.దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

 Are You Eating Cauliflower In Rainy Season.. But You Should Know These Things..!-TeluguStop.com

కాలీఫ్లవర్ క్యాన్సర్ నుంచి ఎముకలను బలంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.కాలీఫ్లవర్ క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందినది.

ఈ కూరగాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.కాలీఫ్లవర్ తెలుపు, ఆకుపచ్చ వంటి ఎన్నోరంగుల్లో లభిస్తుంది.

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.అలాగే ఈ కూరగాయలు ఫోలిక్ యాసిడ్, విటమిన్ b6, విటమిన్ బి5, ఫైబర్, క్యాల్షియం, పుష్కలంగా ఉంటాయి.

ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలావరకు నియంత్రిస్తుంది.ఒక కప్పు కాలీఫ్లవర్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.

అలాగే కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ శరీర కొవ్వును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయను డైట్ చేర్చుకోవడం ఎంతో మంచిది.

ఈ కూరగాయ మధుమేహానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది.ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Telugu Brain, Cauliflower, Foods, Tips, Heart, Imunity, Vitamin-Telugu Health

ఫైబర్ పుష్కలంగా ఉండే కాలీఫ్లవర్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.ఇది మలబద్ధకం నుంచి బయటపడడానికి గట్ ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.కాలిఫ్లవర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.కాలిఫ్లవర్ లో సల్ఫోరాఫేన్ అనే పిలువబడే మొక్కల సమ్మేళనం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants) ఎక్కువగా ఉండే కూరగాయ.కాలీఫ్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

Telugu Brain, Cauliflower, Foods, Tips, Heart, Imunity, Vitamin-Telugu Health

కాలీఫ్లవర్ లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.ఈ కూరగాయ జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.కాబట్టి మెదడు ఆరోగ్యం ( Brain Health )కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.

ఆరోగ్యానికి మంచిదని ఏ ఆహారమైన అతిగా తినడం అస్సలు మంచిది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube