గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, కోవాయ గ్రామంలో( Kovaya village, Amreli district, Gujarat ) మొన్న రాత్రి ఊహించని భయంకరమైన సంఘటన జరిగింది.గ్రామస్తులు నిద్ర లేచి చూసేసరికి, ఒక పెద్ద సింహం ఊరిలోకి వచ్చింది.
అది నేరుగా ములు లఖోత్రా అనే వ్యక్తి ఇంటి గోడ దూకి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది.అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
ఇంట్లో వాళ్లు గాఢ నిద్రలో ఉండగా ఈ హఠాత్పరిణామం చోటుచేసుకుంది.
మొదట్లో వాళ్లకి ఏదో పిల్లి అనుకున్నారు.
కానీ కిచెన్ గోడ దగ్గర, దూలాల మధ్య సింహం కనపడగానే గుండెలు గుభేలుమన్నాయి.ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.
టార్చ్ లైట్లు వేసి చూస్తే అది సింహం అని తేలింది.వెంటనే ఫోన్లు తీసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు.
ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉందో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.గ్రామ కౌన్సిలర్ జీనా లఖోత్రా ఆ భయానక పరిస్థితి గురించి వివరిస్తూ, “సింహం ఏకంగా 12 అడుగుల గోడ దూకి లోపలికి వచ్చింది.
ఇంట్లో వాళ్ళు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా వెంటనే మేల్కొన్నారు.ఊరంతా ఒక్కసారిగా గుమిగూడింది.
సింహం మరింత రెచ్చిపోకుండా అందరం చాలా ప్రశాంతంగా ఉన్నాం” అని చెప్పారు.
వెంటనే అటవీ శాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారు.వాళ్లు క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని సింహాన్ని సురక్షితంగా ఇంటి నుండి బయటకు పంపించేశారు.డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జయేన్ పటేల్ ( Deputy Conservator of Forests Jayen Patel )మాట్లాడుతూ, “ఇది ఆరు సింహాల గుంపునకు చెందిన సింహం.
ఆహారం కోసం అప్పుడప్పుడు ఇలా ఊళ్ళోకి వస్తుంటాయి.ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి” అని తెలిపారు.
కోవాయ గ్రామం అడవులకు, సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ సింహాలు తరచూ కనిపిస్తుంటాయి.అంతేకాదు, దగ్గరలోని పిపావావ్ పోర్టు ప్రాంతంలో కూడా సింహాలు సంచరిస్తున్నట్లు తరచూ వార్తలు వస్తుంటాయి.అమ్రేలి జిల్లాలో దాదాపు 150 సింహాలు ఉన్నాయి.గతంలో కూడా సింహాలు గోడలు ఎక్కి వరండాల్లోకి, పశువుల కొట్టాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.సింహాలు ఈ ప్రాంతంలో సహజంగానే కనిపిస్తుంటాయి కానీ, ఇలా కిచెన్‌లోకి రావడం మాత్రం గ్రామస్తులను బాగా భయపెట్టింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు సింహాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు