1.భారత్ భయపడుతోంది : బైడన్
అమెరికా మిత్ర దేశాల్లాగ రష్యా వైఖరిని ఖందించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ వ్యాఖ్యానించారు.
2.రష్యా పై బైడన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ పై రష్యా జీవాయుదాలను వాడబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
3.జపాన్ తో శాంతి చర్చలు నిలిపివేసిన రష్యా
జపాన్ తో శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగించబోమని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
4.నాటో పై ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి నాటో పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రష్యాను చూసి నాటో భయపడుతోంది అని కామెంట్ చేశారు.
5.కువైట్ లో వెంకటేష్ మృతి పై అనుమానాలు : చంద్రబాబు
కువైట్ లో హత్యానేరం కేసులో అరెస్ట్ అయ్యి, జైలు జీవితం గడుపుతూ ఆత్మహత్యకు పాల్పడిన కడప జిల్లా వాసి వెంకటేష్ మృతి పై అనుమానాలు ఉన్నాయి అని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
6.బెహ్రైన్ కీలక నిర్ణయం.ఉచిత వీసాలు
మల్టిపుల్ ఎంట్రీ వీసాల పై తాజాగా బెహ్రైన్ కీలక నిర్ణయం తీసుకుంది.కింగ్ పహద్ కాజ్ వే ద్వారా బెహ్రైన్ వచ్చే వ్యాపారవేత్తలు, ట్రేడర్లు, ఇన్వెస్టర్ల తో పాటు , వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఉచితంగా మల్టిపుల్ ఎంట్రీ వీసాలు అందజేయనున్నట్లు ప్రకటించింది.
7.అమెరికా లో కొత్త కరోనా వేరియంట్
ఒమి క్రాన్ కొత్త వేరియంట్ BA 2 అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు రీపెంట్ కేసులు చెబుతున్నాయి.గత రెండు వారాలుగా జరిపిన పరీక్షల్లో వస్తున్న పాజిటివ్ ఫలితాలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
8.రష్యా పై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలి : జెలెన్ స్కి
రష్యా పై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ఆకాంక్షించారు.