ధర్మపురి క్షేత్రం ప్రత్యేకత ఏమిటి? యమధర్మరాజుకు ఆలయం ఉందా?

పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైనది ధర్మపురి క్షేత్రం.ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం, మసీదులు పక్కపక్కనే ఉంటాయి.

 What Is The Importance Of Dharmapuri.? Is There Yama Temple In Dharmapuri, Dhar-TeluguStop.com

ఆనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ధర్మపురి క్షేత్రం.ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.

ఈ ఆలయంలో నరసింహ స్వామి ప్రభువు యొక్క రెండు విభిన్న విగ్రహాలు ఉన్నాయి.ఈ విగ్రహాలలో పురాతనమైనదాన్ని “పటా నరసింహ స్వామి” అని పిలుస్తారు, అంటే పాత నరసింహ స్వామి మరియు తరువాత స్థాపించబడిన ఆలయాన్ని కొత్త నరసింహ స్వామి అని పిలుస్తారు, అంటే కొత్తది.

ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం.రాష్ట్రంలోని వేద బ్రాహ్మణుల ముఖ్యమైన స్థావరాలలో ఒకటి.

ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో ధర్మపురిలో జాతర సాగుతుంది.డిసెంబర్ లో మోక్షాద ఏకాదశి వేడుకలకు లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.

ధర్మపురి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది.ధర్మపురిలో యమ ధర్మరాజుకు ఆలయం.ధర్మపురి దర్శనం తర్వాత యమపురి సందర్శన ఉండదని పండితులు చెబుతారు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ….

తీరిక లేకుండా గడిపే యముడు… ఒకరోజు ధర్మపురికి వచ్చి సమీపంలోని గోదావరిలో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నాడని… అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడని పురాణగాథల్లో రచించి ఉంది.ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది.

ముందుగా యమ ధర్మరాజును దర్శించుకున్న తర్వాతే లక్ష్మీ నరసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు దీనిని విధిగా పాటిస్తారు.

ఏ ఆలయానికి లేని మరో ఆచారం ధర్మపురిలో కొనసాగుతోంది.అదే కోనేరులో స్నానాలు చేయవద్దు.

అంటే నృసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించవద్దు.అందులో కేవలం స్వామి వారికి మాత్రమే.

అది కూడా ఉత్సవాల సమయంలోనే స్వామి వారు స్నానం ఆచరిస్తారు.ధర్మపురికి వచ్చిన భక్తులు గోదావరిలోనే స్నానాలు ఆచరించి, ఆలయానికి వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube