అక్టోబర్ నెలలో ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గ్రహాల రాశి చక్రం మార్పు 12 రాశుల జీవితాలపై ప్రభావం చూపుతుంది.అలాగే అక్టోబర్ నెల ఎంతో ప్రత్యేకమైన నెల అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 In The Month Of October, People Of These Signs Should Be Careful , Astrology ,-TeluguStop.com

ఎందుకంటే ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైన గ్రహ సంచరాలు జరగబోతున్నాయి.ఈ గ్రహణ సంచారాల వల్ల కొన్ని రాశుల వారు అధిక ప్రయోజనాలను పొందుతారు.

మరికొన్ని రాశుల వారు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఈ రాశుల వారికి అక్టోబర్ నెల ప్రమాద ఘంటికలు మోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ రాశుల వారి ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది.కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాలలో పెద్ద సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu Astrology, Problems, October, Planetary Cycle, Taurus, Virgo-Telugu Raasi

కొన్ని అజాగ్రత్తల వల్ల ఉద్యోగం పోతుందని భయం కూడా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే వృషభం రాశి( Taurus ) వారు ఈ నెలలో ఎంతో బిజీగా ఉంటారు.ఈ రాశి వారు పని విషయంలో చాలా తొందర పడుతుంటారు.దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.ఈ నెలలో మీతో పని చేసే వ్యక్తుల పట్ల మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.ప్రస్తుతం మీ ప్రత్యర్ధులలో కొందరు బలంగా ఉంటారు.

వారు మిమ్మల్ని కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.దీనివల్ల మీరు మానసికంగా కూడా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు.

పొట్ట సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.కాబట్టి ఆరోగ్యం గురించి అ జాగ్రత్తగా ఉండకూడదు.

Telugu Astrology, Problems, October, Planetary Cycle, Taurus, Virgo-Telugu Raasi

అలాగే కన్య రాశి ( Virgo )వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.ఉద్యోగస్తులకు ఇది చాలా కష్ట కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు.లేదంటే మీరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్లో( Health problems ) పడవచ్చు.

అలాగే కుంభ రాశి వారు కూడా ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైన రెండు రంగాలవారు తమ పనిలో నిజాయితీగా ఉండడమే మంచిది.

లేకపోతే ప్రభుత్వ రంగం నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube