ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరినో పట్టి పీడిస్తున్న సమస్య రక్త హీనత.ఈ సమస్య బారిన పడితే.వారి రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.దాంతో నీరసం, అలసట, చర్మం పాలిపోవడం, తరచూ అనారోగ్యానికి గురి కావడం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
అందుకే రక్త హీనత సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.అయితే రక్త హీనతకు చెక్ పెట్టడంతో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాంటి వాటిలో పటిక బెల్లం కూడా ఒకటి.సాధరంగా దేవుడికి చేసే ప్రసాదాల్లో పటిక బెల్లంను ఎక్కువగా వాడతారు.
అద్భుతమైన రుచి కలిగి ఉండే పటిక బెల్లంలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.అందుకు పంచదార కన్నా.
పటిక బెల్లం వాడటమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా రక్త హీనత ఉన్న వారు పటిక బెల్లంను పాలలో కలిపి తీసుకోవాలి.

లేదా గోరు వెచ్చని నీటిలో పటిక బెల్లం పొడి, యాలకుల పొడి మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా ఎలా తీసుకున్నా.రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.ఫలితంగా రక్త హీనత సమస్య దూరం అవుతుంది.ఇక పటిక బెల్లంతో మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.భోజనం చేసిన తర్వాత చిన్న పటిక బెల్లం ముక్క తింటే.
తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దరి చేరకుండా రక్షిస్తుంది.
భోజనం తర్వాత వచ్చే బద్దకానికి కూడా పటిక బెల్లం చెక్ పెడుతుంది.అలాగే చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధ పడుతుంటారు.
అలాంటి వారు తరచూ పటిక బెల్లం ముక్కను చప్పరిస్తే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.