గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుంచి తమను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా వాడాల్సిందే.ఇంతకుముందు ఎప్పుడూ మాస్క్ అంటే తెలియని వాళ్లు కూడా ఇప్పుడు మాస్క్ వేసుకొని తిరగాల్సిన టైం వచ్చింది.
అయితే కొందరిలో మాస్కు వాడటం వల్ల వారికి చర్మంపై నల్లటి మచ్చలు సమస్యలు వేధిస్తున్నాయి.ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మాస్క్ వేసుకోవడం మానేయాలి అది కుదరని పని కాబట్టి, అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మనమేం చేయాలి ఇక్కడ చూద్దాం.
1.మనం మాస్కు వేసుకుని బయటకు వెళ్ళిన కొద్దిసేపటికి ముక్కు, గడ్డం మొత్తం చెమటలు వచ్చి దురద వేస్తూ ఉంటుంది.అలాంటప్పుడు క్లాత్ మాస్క్ కాకుండా సర్జికల్ మాస్క్ వేసుకోవడం చాలా మంచిది.
2.మాస్కు వేసుకున్నప్పుడు మాటిమాటికి తీసేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి వీలైనంత వరకు స్కిన్ కి సరిపడా మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళాలి.
3 రోజంతా ఒకే మాస్క్ కాకుండా వీలైనంత వరకు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మాస్కు మార్చడం మంచిది.బయటనుంచి వచ్చిన తర్వాత ఆ మాస్కును ఎండలో కాసేపు వేయాలి.ఇలా మాస్కులు మార్చడం వల్ల కూడా మనం చర్మ సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
4 మాస్క్ వేసుకున్నప్పటికీ ఫేస్ షీల్డ్ ధరించడం మంచిది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు బయట తిరగడం తగ్గిస్తే మరీ మంచిది.
5.మాస్కు వల్ల మచ్చలు ఏర్పడినప్పుడు ఇంటికి రాగానే మొదటగా చల్ల నీళ్ళతో మొహం కడుక్కోవాలి.
ఏదైనా యాంటీ రాషెస్ క్రీమ్ లేదా గంధం కానీ పట్టించుకోవాలి.దీని వల్ల మచ్చలు మంట లేకుండా మానిపోతాయి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి.
స్టే హోమ్ స్టే సేఫ్.