సాధారణంగా బయటకు బహిర్గతమయ్య శరీర భాగాల్లో పాదాలు( feet ) కూడా ఒకటి.అందుకే మగువలు పాదాల సంరక్షణలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు.
పాదాలను తెల్లగా అందంగా మెరిపించుకోవాలని ఆరాటపడుతుంటారు.నెలకు కనీసం ఒకసారైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లి పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు.
అయితే ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పాదాలు నల్లగా నిర్జీవంగా మారిపోతుంటాయి.అలాంటి సమయంలో కేవలం పది నిమిషాల్లోనే మీ పాదాలను వైట్ గా, బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ ( Sugar )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్( Salt ), రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ), అర టీ స్పూన్ పసుపు( Turmaric ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు తేనె, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చెక్కతో పాదాలను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.దాదాపు 5 నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా టవెల్‌తో తుడుచుకోవాలి.ఫైనల్ గా పాదాలకు మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
ఈ సింపుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.పాదాలు తెల్లగా మృదువుగా మరియు కాంతివంతంగా మారతాయి.డార్క్ అండ్ డల్ గా ఉన్న పాదాలను రిపేర్ చేయడంలో, తక్షణ మెరుపును అందించడంలో ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని చాలా బాగా సాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.