Asafoetida : వంటల్లో ఇంగువను ఉపయోగించే ముందు.. ఈ విషయాలను తెలుసుకోండి..!

ఇంగువ అంటే దాదాపు చాలామందికి తెలుసు.దీని గురించి సపరేట్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Know These Things Before Using Asafoetida In Cooking-TeluguStop.com

పూర్వం నుండి కూడా వంటల్లో ఇంగువను( asafoetida ) ఉపయోగిస్తూ వస్తున్నారు.అయితే ఇంగువను వంటల్లో వేయడం వలన మంచి రుచి, సువాసన వస్తుంది.

అంతే కాకుండా ఇంగువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.ఇంగువను ఆయుర్వేదంలో కూడా పలు రకాల రోగాలు నయం చేయడానికి ఔషధంగా ఉపయోగిస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు.

ఇంగువను తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Arthritis, Asafoetida, Immunity, Bee Asafoetida, Stomach Discomt-Telugu H

చాలామందికి ఇది తీసుకోవడం వలన పొట్టలో ఉండే అసౌకర్యం( Stomach discomfort ) కూడా తగ్గుతుంది.కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.అలాగే పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

చాలామందికి శరీరంలో వేడితో ఇబ్బంది ఉంటుంది.అందులోనూ వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది.

అలాంటి వారు ఇంగువను తీసుకుంటే ఈ సమస్య అదుపులోకి వస్తుంది.అలాగే ఆర్థరైటిస్( Arthritis ) లాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఇంగువను తీసుకుంటే చక్కటి ఉపశమనం ఉంటుంది.

ఇంగువ తీసుకోవడం వలన రక్తపోటు కూడా తగ్గుతుంది.ఇక బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ను ఇంగువ అదుపు చేస్తుంది.

Telugu Arthritis, Asafoetida, Immunity, Bee Asafoetida, Stomach Discomt-Telugu H

ఇంగువను తీసుకోవడం వలన శ్లేష్మం, దగ్గు, కఫం లాంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.ఇంగువను తరచూ తీసుకోవడం వలన నెలసరి సమయంలో స్త్రీలలో వచ్చే నొప్పి కూడా తగ్గిపోతుంది.ఇంగువ తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి ( Immunity ) పెరుగుతుంది.

దీంతో బ్యాక్టీరియా వైరస్ కారణంగా కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.ఇక ఇంగువ తీసుకుంటే చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మొటిమలు, తామర, గజ్జి లాంటి చర్మ సమస్యలు ఉన్నవారు కూడా ఇంగువను వాడితే మంచి ఉపశమనం ఉంటుంది.అంతేకాకుండా లైంగిక సామర్థ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube