నేడే సంకష్టహర చతుర్థి.. బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో ఇలా కడితే?

వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజులలో సంకష్టహర చతుర్థి ఒకటి.నేడు (ఆదివారం) సంకష్టహర చతుర్థి కావటంతో వినాయకుడికి ప్రత్యేక పూజలను చేయడం వల్ల సకల సంపదలు కలిగిస్తాడని పండితులు చెబుతున్నారు.

 Importance Of Sankashtahara Chaturthi Vratham,sankashtahara Chaturthi Vratham, V-TeluguStop.com

మన జీవితంలో ఏర్పడిన ఒత్తిడి ఆందోళనలు తొలగిపోవాలంటే నేడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.మరి సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం…

సంకష్టహర చతుర్థి రోజు సూర్యోదయాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం వినాయకుడికి సంకష్ట చతుర్ధి వ్రతాన్ని ఆచరించాలి.చంద్రుని దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.

చంద్రుని దర్శనం తర్వాత వినాయకుడికి ప్రత్యేక పువ్వులతో అలంకరించి పూజ చేయాలి.వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక, మోదకాలు తప్పనిసరిగా పూజలు సమర్పించాలి.

అదేవిధంగా వినాయకుడి పూజలో భాగంగా ఆరు మీటర్ల ఎర్రని వస్త్రాన్ని తీసుకొని వినాయకుడు ముందు ఉంచి పసుపు కుంకుమతో అలంకరించాలి.

Telugu Ganesh, Pooja, Red, Rituals, Vinayaka Pooja-Telugu Bhakthi

మన మనసులో ఏదైనా బలమైన కోరికను కోరుకొని మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని వస్త్రంలోకి వేయాలి.అదేవిధంగా రెండు తమలపాకులు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని ఆ బియ్యాన్ని మూటకట్టి సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి.ఆ విధంగా కట్టిన మూటను స్వామివారి ముందు నుంచి ధూప దీప నైవేద్యాలతో నమస్కరించాలి.

అనంతరం వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ 3 లేదా 11 ప్రదక్షిణాలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube